Page Loader
Telangana Election: బీఎస్పీ మీటింగ్‌లో కూలిన టెంట్.. 15మందికి గాయాలు 
Telangana Election: బీఎస్పీ మీటింగ్‌లో కూలిన టెంట్.. 15మందికి గాయాలు

Telangana Election: బీఎస్పీ మీటింగ్‌లో కూలిన టెంట్.. 15మందికి గాయాలు 

వ్రాసిన వారు Stalin
Nov 20, 2023
05:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములవాడలో బీఎస్‌పీ ప్రజా ఆశీర్వాద సభను ఏర్పాటు చేసింది. అయితే ఈ సభలో అపశృతి చోటు చేసుకుంది. మీటింగ్ ప్రారంభమయ్యే సమయంలో భారీ గాలి దుమారం వచ్చింది. దీంతో బీఎస్పీ సభ వేదిక కూలిపోయింది. ఈ క్రమంలోనే సభా వేదిక దగ్గర టెంట్లు కూడా కుప్పకూలాయి. టెంట్లకు ఉన్న ఇనుప బొంగులు తాకి 15 మంది బీఎస్పీ శ్రేణులు గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బీఎస్‌పీ తెలంగాణ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ అక్కడే ఉన్నారు. ఈ ఘటనలో ప్రవీణ్ కుమార్‌కు ఎలాంటి గాయాలు కాలేదని పార్టీ వర్గాలు తెలిపాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గాయపడిన వారిని ఆస్పత్రికి తరలింపు