Telangana Elections : ఈ అభ్యర్థులు కోటీశ్వరులే.. వందల కోట్లాధిపతులు ఎవరో తెలుసా
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే సగం ప్రచారం పూర్తి చేసుకున్నారు. అయితే ఈసారి పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో చాలా మంది కోటీశ్వరులే ఉండటం గమనార్హం. ఈ జాబితాలో కొద్దిమంది నేతలు తమ పేరు పైనా, కుటుంబీకుల పేరిట స్థిర, చరాస్తులు రూ.కోట్లల్లో ఉన్నాయి. ఈ క్రమంలోనే రిటర్నింగ్ అధికారులకు సమర్పించిన నామినేషన్లలో అభ్యర్థులే స్వయంగా ఈ వివరాలు పొందుపర్చారు. పలువురు ఎమ్మెల్యేలు కాంట్రాక్టర్లుగా, విద్యాసంస్థల అధిపతులుగా, వస్త్ర వ్యాపారులుగా, స్థిరాస్తి రంగాలకు చెందిన వారు ఉండటం కొసమెరుపు.
వంద కోట్ల హీరోలు వీరే :
నాగర్ కర్నూల్‌లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న మర్రి జనార్దన్‌రెడ్డి కుటుంబ ఆస్తుల విలువ రూ.112.23 కోట్లుగా ఉంది. నారాయణపేట బీఆర్ఎస్ అభ్యర్థి ఎస్.రాజేందర్‌రెడ్డి రూ.110.15 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే అభ్యర్థి ఆల వెంకటేశ్వర్‌రెడ్డి రూ.73.60 కోట్లతో మూడో స్థానంలో ఉండగా, కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి, కసిరెడ్డి నారాయణరెడ్డి రూ.63.58 కోట్ల ఆస్తులను కలిగి ఉన్నారు. కొల్లాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్‌రెడ్డి, ఆయన భార్య విజయకు కలిపి మొత్తం రూ.11.82 కోట్ల చర, స్థిరాస్తులు ఉన్నాయి. నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి, భార్య జమున పేరు మీద కలిపి మొత్తం రూ.112.23 కోట్ల స్థిర, చరాస్తులున్నాయి.
ఎస్.రాజేందర్ రెడ్డి, విద్యా సంస్థల అధిపతి
వనపర్తి బీఆర్ఎస్ అభ్యర్థి నిరంజన్‌రెడ్డి, ఆయన భార్య వాసంతి పేరు మీద కలిపి మొత్తం రూ.7.98 కోట్ల చర, స్థిరాస్తులున్నాయి. నారాయణపేట బీఆర్ఎస్ అభ్యర్థి ఎస్.రాజేందర్ రెడ్డి, భార్య స్వాతిరెడ్డి పేరు మీద కలిపి మొత్తం రూ.110.15 కోట్ల స్థిర, చరాస్తులున్నాయి. ఈయనకు కర్ణాటక రాయచూరులో విద్యా సంస్థలున్నాయి. మక్తల్ బీజేపీ అభ్యర్థి జలంధర్‌రెడ్డి, ఆయన భార్య పద్మజ పేరు మీద రూ.45.89 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఈయన కాంట్రాక్టురుగా పనిచేస్తున్నారు. దేవరకద్ర బీఆర్ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వర్ రెడ్డి కాంట్రాక్టర్ గానూ కొనసాగుతున్నారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆస్తి ఎంతో తెలుసా
ఆయన భార్య మంజులకి కలిపి మొత్తం రూ. 73.60 కోట్ల విలువ చేసే చర, స్థిరాస్తులున్నాయి. జడ్చర్ల కాంగ్రెస్ అభ్యర్థి, వ్యాపారస్తుడు అనిరుథ్‌రెడ్డి, ఆయన భార్య మంజుషకు కలిపి రూ.47.45కోట్ల ఆస్తులు ఉన్నాయి. జడ్చర్ల బీఆర్ఎస్ అభ్యర్థి డా.లక్ష్మారెడ్డి ఆయన భార్య శ్వేతకు కలిపి మొత్తం రూ. ss32.87 కోట్ల చర, స్థిరాస్తులు ఉన్నాయి. మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ ఆయన భార్య శారద పేరు మీద కలిపి రూ.23.10 కోట్ల స్థిర, చరాస్తులున్నాయి. మహబూబ్‌నగర్ కాంగ్రెస్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆయన భార్య పేరు మీద రూ.4.84 కోట్ల ఆస్తులు ఉన్నాయి.