Page Loader
Telangana Elections : ఓటేసిన సినీ ప్రముఖులు.. క్యూలో నిల్చున్న ఎన్టీఆర్‌ ఫ్యామిలీ, అల్లు అర్జున్‌ 
క్యూలో నిల్చున్న ఎన్టీఆర్‌ ఫ్యామిలీ, అల్లు అర్జున్‌

Telangana Elections : ఓటేసిన సినీ ప్రముఖులు.. క్యూలో నిల్చున్న ఎన్టీఆర్‌ ఫ్యామిలీ, అల్లు అర్జున్‌ 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 30, 2023
09:59 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో ఎన్నికల పోలింగ్‌ (Telangana Elections 2023) జోరుగా కొనసాగుతోంది. ఈ మేరకు పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ (NTR), అల్లు అర్జున్‌ (Allu Arjun), సుమంత్, సంగీత దర్శకుడు కీరవాణి తదితరులు క్యూలైన్‌లో నిల్చుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదే సమయంలో జూ.ఎన్టీఆర్‌ తన కుటుంబంతో కలిసి జూబ్లీహిల్స్‌లోని ఓబుల్‌రెడ్డి స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. వెంట తన సతీమణి లక్ష్మీ ప్రణతి, తల్లి షాలినితో కలిసి ఎన్టీఆర్‌ వచ్చారు.

DETAILS

 బీఎస్‌ఎన్‌ఎల్‌ సెంటర్‌ పోలింగ్‌ బూత్‌లో అల్లు అర్జున్

మరో స్టార్ హీరో అల్లు అర్జున్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌ సెంటర్‌ పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇదే సమయంలో జూబ్లీహిల్స్‌ క్లబ్‌లో సుమంత్‌ సైతం ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక మాదాపూర్‌లోని వెంకటేశ్వర ఫైన్‌ ఆర్ట్స్‌ కళాశాల పోలింగ్‌ బూత్‌లో హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్‌ రోస్‌ ఓటు వేసేశారు. తన సతీమణితో కలిసి పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన, జీహెఎంసీ కమిషనర్, నగర ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రొనాల్డ్‌ రోస్‌ సూచనలు అందించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

క్యూలో నిల్చుని ఓటర్లతో ముచ్చటిస్తున్న అల్లు అర్జున్

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కుటుంబంతో కలిసి వచ్చేసిన జూ.ఎన్టీఆర్