
తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు, ఈవీఎంలను తనిఖీ చేశాం: సీఈఓ
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్లంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు.
బీఆర్‌కే భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా సెంటర్‌ను సీఈఓ వికాస్‌రాజ్ ప్రారంభించారు.
ఇప్పటికే తెలంగాణలో ఎన్నికల ప్రక్రియలో వేగం పెరిగిందనట్లు వెల్లడించారు. ఎన్నికలకు అవసరమైన అన్నిచర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఇప్పటికే ఈవీఎంలను తనిఖీ చేశామని సీఈఓ అన్నారు. అధికారుల శిక్షణ కోసం కూడా ఈవీఎంలను తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు చెందిన దాదాపు 20 ఏజెన్సీలతో సమావేశాలు నిర్వహిస్తామన్నారు.
ఎన్నికలు
అక్టోబర్ 4,5, 6 తేదీల్లో కేంద్ర ఎన్నికల బృందం పర్యటన
ఇప్పటి నుంచి కేంద్ర ఎన్నికల సంఘానికి వారానికోక నివేదికను అందజేస్తామని సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు.
అలాగే అక్టోబర్ 4,5, 6 తేదీల్లో భారత ఎన్నికల సంఘం బృందం తెలంగాణలో పర్యటించనున్నట్లు తెలిపారు.
కేంద్ర బృందం తమతో పాటు వివిధ రాజకీయ పార్టీలు, కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలతో రాష్ట్ర స్థాయిలో ముఖ్యమైన అంశాలపై సమావేశాలు నిర్వహిస్తారని ఆయన స్పష్టం చేసారు.
అక్టోబర్ నెలలో ఎన్నికలకు సంబంధించిన డిస్టిబ్యూషన్, స్ట్రాంగ్ రూముల ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో జనవరి నుంచి ఇప్పటి వరకు 15లక్షల కొత్త ఓట్లు నమోదైనట్లు సీఈఓ చెప్పారు.
అలాగే 3లక్షల ఓట్లు రద్దయ్యాయని పేర్కొన్నారు. తెలంగాణలో ఓట్ల నమోదు ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని వికాస్‌రాజ్ చెప్పారు.