తెలంగాణ: ఇంటర్మీడియట్‌లో ఇంగ్లిష్ ప్రాక్టికల్స్; ఈ ఏడాది నుంచే అమలు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 2023-24 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా ఇంగ్లిష్ ప్రాక్టికల్ నిర్వహించాలని నిర్ణయించింది.
ప్రాక్టికల్‌కు 20 మార్కులు, థియరీ పార్ట్‌కు 80 మార్కులను కేటాయించనున్నారు. విద్యార్థుల ఆంగ్ల భాషా నైపుణ్యాలను, ముఖ్యంగా మాట్లాడే, గ్రహణశక్తిని మెరుగుపరచడానికి, తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఆంగ్ల భాషకు ప్రాక్టికల్స్ లేవు. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, వివిధ వృత్తి విద్యా కోర్సులకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నారు.
తెలంగాణ
ఇంటర్ కాలేజీల్లో ఇంగ్లిష్ ల్యాబ్‌ల ఏర్పాటు
సైన్స్ స్ట్రీమ్ మాదిరిగానే జూనియర్ కాలేజీ యాజమాన్యాలు తమ కాలేజీల్లో ఇంగ్లిష్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసుకోవాలని తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆదేశించింది.
ఈ ల్యాబ్‌లు విద్యార్థులకు మాట్లాడే భాషా నైపుణ్యాలను మెరుగుపరచడంలో, మెరుగైన గ్రహణశక్తిని పెంపొందించుకోవడానికి ఉపయోగపడనున్నాయి.
కంప్యూటర్‌లను ఉపయోగించి, విద్యార్థులు తమ స్పోకెన్ ఇంగ్లీషు నైపుణ్యాలను రికార్డ్ చేయవచ్చు. టెస్టింగ్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి ఉచ్చారణ, వాక్య నిర్మాణం, ఇతర వ్యాకరణ దోషాలు ఏవైనా ఉంటే తనిఖీ చేసేలే ఏర్పాట్లు చేయనున్నారు.
ఇంగ్లిష్ ప్రాక్టికల్ విధివిధాలను ఇప్పటికే రూపొందించినట్లు సమాచారం.