Telangana Express: తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌కు 50 ఏళ్లు.. నేటితో అర్ధ శతాబ్దం పూర్తి
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ రాష్ట్ర రాజధానిగా, దిల్లీ దేశ రాజధానిగా ఉన్న నేపథ్యంలో.. ఈ రెండు నగరాలను కలుపుతూ నడుస్తున్న తెలంగాణ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు శనివారంతో అర్ధ శతాబ్దం పూర్తి చేసుకుంది. ఈ రైలు ప్రారంభమై 50 ఏళ్లు పూర్తయ్యాయి. 1976 అక్టోబరు 3న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగం వెంగళ్‌రావు, అప్పటి రైల్వే మంత్రి మధు దండవతె సికింద్రాబాద్‌లో తెలంగాణ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు శ్రీకారం చుట్టారు. తొలినాళ్లలో ఈ ఎక్స్‌ప్రెస్ రైలును 14 బోగీలతో వారానికి రెండుసార్లు నడిపించారు. ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరగడంతో వారానికి మూడుసార్లు నడిపేలా చేశారు. ఆ తర్వాత 1991 నుంచి ఈ రైలును ప్రతిరోజూ నడుపుతున్నారు.
వివరాలు
2015లో తెలంగాణ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్'గా నామకరణం
ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బోగీల సంఖ్యను కూడా 24కు పెంచారు.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం 2015 నవంబరు 15న ఈ రైలు పేరును 'తెలంగాణ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్'గా మార్చారు.
ఇదిలా ఉండగా, ఈ రైలుకు పెద్దపల్లి జంక్షన్‌లో స్టాప్ సదుపాయం కల్పించాలని ఉత్తర తెలంగాణ రైల్వే ఫోరం సభ్యుడు ఫణి కుమార్ కోరుతున్నారు.
పెద్దపల్లి జంక్షన్‌లో రైలు ఆగేలా చేస్తే హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులకు మరింత సౌకర్యంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.