LOADING...
TSRTC fitment: ఆర్టీసీ ఉద్యోగులకు 21% ఫిట్‌మెంట్‌ ప్రకటించిన తెలంగాణ సర్కార్ 
TSRTC fitment: ఆర్టీసీ ఉద్యోగులకు 21% ఫిట్‌మెంట్‌ ప్రకటించిన తెలంగాణ సర్కార్

TSRTC fitment: ఆర్టీసీ ఉద్యోగులకు 21% ఫిట్‌మెంట్‌ ప్రకటించిన తెలంగాణ సర్కార్ 

వ్రాసిన వారు Stalin
Mar 09, 2024
04:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు 21 శాతం పీఆర్సీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. పీఆర్సీతో కూడిన వేతనాలను జూన్‌ ఒకటో తేదీ నుంచి అమలోకి రానున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని బస్‌ భవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పొన్నం ప్రభాకర్‌ మాట్లాడారు. టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి కొన్ని నిర్ణయాలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. 2017లో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 16శాతం పీఆర్సీ ఇచ్చిందన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పీఆర్సీ ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చేందుకు ముందుకొచ్చినట్లు చెప్పారు. ఈ క్రమంలోనే ఉద్యోగులకు 21శాతం పీఆర్సీ ఇవ్వనున్నట్లు చెప్పారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జూన్ నుంచి కొత్త పీఆర్సీ అమలు