LOADING...
Polavaram: బనకచర్ల ప్రాజెక్టుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం.. ఈనెల 5న విచారణ
బనకచర్ల ప్రాజెక్టుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం.. ఈనెల 5న విచారణ

Polavaram: బనకచర్ల ప్రాజెక్టుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం.. ఈనెల 5న విచారణ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 02, 2026
04:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు అక్రమంగా మళ్లించడాన్ని సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం న్యాయపోరాటానికి సిద్ధమైంది. ఈ విషయాన్ని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిందని, ఆ పిటిషన్‌పై జనవరి 5న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టే అవకాశం ఉందని తెలిపారు.

Details

 హరీశ్ రావు ఆరోపణలపై ఉత్తమ్ ఖండన

పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు వచ్చాయని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలను మంత్రి ఉత్తమ్ తీవ్రంగా ఖండించారు. 200 టీఎంసీల గోదావరి జలాలను మళ్లించేందుకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎలాంటి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఈ అంశంపై హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలన్నీ అసత్యాలేనని మంత్రి స్పష్టంగా చెప్పారు.

Details

కేంద్రం అనుమతులు నిలిపివేత

పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అనుమతులను నిలిపివేయడమే కాకుండా, ఆ ప్రాజెక్టుకు సంబంధించిన వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీ విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక్కి తగ్గిందని మంత్రి ఉత్తమ్ గుర్తు చేశారు. అదేవిధంగా డిసెంబర్ 4, 2025 నాటికి పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్ట్ (PFR)కు సంబంధించి సూత్రప్రాయంగా కూడా ఎలాంటి సమ్మతి ఇవ్వలేదని ఆయన వెల్లడించారు.

Advertisement

Details

అసెంబ్లీ తీర్మానం 

ఇదిలా ఉండగా పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని హరీశ్ రావు మంగళవారం పిలుపునిచ్చారు. అలాగే సీడబ్ల్యూసీ ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలన్న డిమాండ్‌తో ఢిల్లీలో నిరసన చేపట్టాలని సూచించారు. బచావత్ అవార్డు ప్రకారం నీటి వాటా బచావత్ ట్రైబ్యునల్ అవార్డు ప్రకారం గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లిస్తే, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు 45:21:14 నిష్పత్తిలో నీటి వాటా రావాల్సి ఉంటుందని హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ నిబంధనలు పోలవరం, బనకచర్ల ప్రాజెక్టులకు కూడా వర్తిస్తాయని ఆయన గతంలోనే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Advertisement