
TGIIC: కంచ గచ్చిబౌలి భూములపై టీజీఐఐసీ కీలక ప్రకటన.. ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే
ఈ వార్తాకథనం ఏంటి
కంచ గచ్చిబౌలి భూములపై టీజీఐఐసీ (TGIIC) కీలక ప్రకటన విడుదల చేసింది.
ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని స్పష్టంగా ప్రకటించింది. ప్రాజెక్టులో సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూమి లేదని స్పష్టం చేసింది.ఈ విషయాన్ని టీజీఐఐసీ తెలియజేసింది.
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి ప్రభుత్వానికి చెందినదే.ఈ భూమి హక్కుదారుడుగా ప్రభుత్వం న్యాయస్థానంలో తన ఆధిక్యతను నిరూపించుకుంది. 21 సంవత్సరాల క్రితం ప్రైవేటు సంస్థకు కేటాయించిన భూమిని న్యాయపోరాటం ద్వారా తిరిగి సాధించుకుంది.అభివృద్ధి కోసం కేటాయించిన భూమిలో ఎలాంటి చెరువులు లేవు.సర్వే ప్రకారం,అక్కడి ఒక్క అంగుళం భూమి కూడా సెంట్రల్ యూనివర్సిటీకి చెందదని తేలింది.నూతనంగా అమలు చేయనున్న అభివృద్ధి ప్రణాళిక అక్కడ ఉన్న రాళ్ల భౌగోళిక నిర్మాణాన్ని ఏమాత్రం దెబ్బతీయదు.
వివరాలు
బఫెల్లో లేక్, పీకాక్ లేక్ లేవు: టీజీఐఐసీ
ప్రభుత్వం చేపడుతున్న ప్రతి ప్రణాళికలో స్థానిక స్థిరాభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణకు ప్రాముఖ్యతనిస్తుంది.
ప్రాజెక్ట్‌ను వ్యతిరేకిస్తున్న కొందరు రాజకీయ నాయకులు విద్యార్థులను తప్పుదారి పట్టిస్తున్నారు.
400 ఎకరాల భూమి పూర్తిగా ప్రభుత్వ స్వాధీనంలోనే ఉంది. అటవీ భూమిగా తప్పుడు ప్రచారం జరుగుతోంది.
రెవెన్యూ రికార్డుల ప్రకారం కూడా ఈ 400 ఎకరాలు ప్రభుత్వ భూమిగానే లిఖించబడ్డాయి.
ఇందులో బఫెల్లో లేక్, పీకాక్ లేక్ లేవు. ప్రపంచ స్థాయి ఐటీ మౌలిక సదుపాయాల అభివృద్ధి, అనుసంధానత విస్తరణ, పట్టణ స్థలాల సమర్థవంతమైన వినియోగం వంటి ప్రభుత్వ లక్ష్యాలకు ఈ ప్రాజెక్టు అనుగుణంగా కొనసాగుతుంది''అని టీజీఐఐసీ వెల్లడించింది.