LOADING...
Telangana: అర్చక,ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. గ్రాట్యుటీ పెంపు
అర్చక,ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. గ్రాట్యుటీ పెంపు

Telangana: అర్చక,ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. గ్రాట్యుటీ పెంపు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 10, 2025
10:38 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలోని ఆలయాల్లో అనేక సంవత్సరాలుగా సేవలందిస్తున్న అర్చకులు,ఇతర దేవాదాయ శాఖ ఉద్యోగులకు శుభవార్తను ప్రభుత్వం అందించింది. ఈ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక నిధిని ఏర్పాటు చేసింది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఈ అర్చక, ఉద్యోగుల సంక్షేమ నిధికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. అదనంగా, ఇప్పటికే ఉన్న గ్రాట్యుటీ మొత్తాన్ని రూ.4 లక్షల నుండి రూ.8 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సంక్షేమ నిధి ద్వారా, దేవాదాయ శాఖ పరిపాలనలో ఉన్న సహాయ కమిషనర్ స్థాయి వరకు కలిగిన దేవాలయాల్లో విధులు నిర్వహిస్తున్న సుమారు 13,700 మంది అర్చకులు,ఇతర ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది.

వివరాలు 

అంత్యక్రియల నిధి పెంపు 

విధి విరమణ అనంతరం లేదా అకాల మరణం సంభవించిన సందర్భాల్లో ప్రభుత్వం అందించే మృతుల అంత్యక్రియల నిధిని రూ.20 వేలు నుంచి రూ.30 వేలకు పెంచింది. దేవాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న అర్చకులు, ఇతర ఉద్యోగులకు పదవీ విరమణ తరువాత లేదా మరణించిన అనంతరం అందే గ్రాట్యుటీ మొత్తం కూడా ఇప్పటి వరకు ఉన్న రూ.4 లక్షల నుండి రెండింతలు పెరిగి రూ.8 లక్షలకు చేరనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వలన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది అర్చకులు, ఆలయ ఉద్యోగులకు భవిష్యత్తులో ఆర్థిక భద్రత లభించే అవకాశముంది.