తెలంగాణ ఉద్యోగులకు సర్కారు వారి భారీ కనుక.. ఇళ్లు కట్టుకుంటే రూ.30 లక్షల అడ్వాన్స్
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు ఉద్యోగులకు ట్రావెలింగ్ అండ్ కన్వీయన్స్ అలవెన్సు (ప్రయాణ మరియు రవాణా భత్యం) 30 శాతానికి పెంచింది.
సెలవు రోజుల్లో పనిచేసే లిఫ్ట్ ఆపరేటర్లు, డ్రైవర్లకు అదనంగా రూ.150 చెల్లించనున్నట్లు వెల్లడించింది.
షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని ఉద్యోగులకు స్పెషల్ కాంపన్సేటరీ అలవెన్స్‌ను 30 శాతానికి పెంచుతూ నిర్ణయించింది.
దివ్యాంగ ఉద్యోగులకు అందించే కన్వీయన్స్ అలవెన్స్ రూ. 2 వేల నుంచి రూ. 3 వేలకు పెంచుతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇళ్ల నిర్మాణానికి ఇచ్చే అడ్వాన్స్ రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచింది.
DETAILS
పెన్షన్ దారులు మరణిస్తే రూ. 30 వేల తక్షణ సాయం
మరోవైపు కొద్దిరోజుల క్రితమే ప్రభుత్వం 2.73 శాతం డీఏ ప్రకటించడం విశేషం. ఇళ్ల నిర్మాణానికి ఇచ్చే అడ్వాన్స్ లను రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచినట్లు తెలిపింది.
పోలీసులకు స్పెషల్ పేస్‌ను 2020 పే స్కేల్ ప్రకారం వర్తింపచేస్తామని చెప్పింది. గ్రేహౌండ్స్, ఇంటిలిజెన్స్, ట్రాఫిక్, సీఐడి, ఆక్టోపస్, యాంటి నక్సలైట్ స్క్వాడ్ విభాగాల్లో పని చేసే వారందరికీ ఇస్తామని చెప్పుకొచ్చింది.
పెన్షన్ దారులు మరణిస్తే అందించే తక్షణ సాయం రూ. 20 వేల నుంచి రూ. 30 వేలకు పెంచినట్లు తెలిపింది. ఈ మేరకు విభాగాల వారీగా ఉత్వర్వులు జారీ అయ్యాయి.
తాజాగా మరింత ప్రయోజనం కల్పిస్తూ ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.