Page Loader
ఆసియాలోనే అతిపెద్ద నివాస సముదాయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్
ఆసియాలోనే అతిపెద్ద నివాస సముదాయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్

ఆసియాలోనే అతిపెద్ద నివాస సముదాయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 22, 2023
03:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ప్రభుత్వం అతిపెద్ద ప్రభుత్వ నివాస సముదాయాన్ని ప్రారంభించింది. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో దాదాపు 145 ఎకరాల విస్తీర్ణంలో 15 వేల 660 డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్లను నిర్మించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ హోసింగ్ కాంప్లెక్స్ కు ప్రారంభోత్సవం చేశారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ప్రభుత్వ సామాజిక నివాస సముదాయంగా ఇది కీర్తి గడించింది. ఈ హౌసింగ్ సొసైటీకి కేసీఆర్‌ నగర్‌ 2బీకే డిగ్నిటీ హౌసింగ్‌ కాలనీగా పేరు పెట్టారు. ఈ నేపథ్యంలో ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఆరుగురు లబ్ధిదారులకు గృహాలను కేటాయించారు. ఆయా పత్రాలను సీఎం కేసీఆర్ తన చేతుల మీదుగా అందజేశారు.

DETAILS

దాదాపుగా 60 వేల మంది నివాసం ఉండేలా ప్లాన్

అంతకుముందు రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్ ను వీక్షించారు. అనంతరం గృహ నిర్మాణాల సముదాయాన్ని సీఎం కేసీఆర్‌ పరిశీలించారు. ఒకేచోట ఏకంగా 15 వేల 660 ఇళ్ల నిర్మాణంతో దాదాపుగా 60 వేల మంది నివాసం ఉండేలా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఈ గృహ సముదాయంలో ఒక్కో ఇంటిని 560 చదరపు అడుగుల (ఎస్‌ఎఫ్‌టీ ) విస్తీర్ణంలో కట్టారు. 117 బ్లాకులుగా విభజించి జీ+9, జీ+10, జీ+11 అంతస్తులుగా నిర్మించారు. కేటాయించిన భూమిలో కేవలం 37 శాతాన్నే ఇళ్లు కోసం వినియోగించగా, మిగిలిన 63 శాతం మౌలిక వసతుల కల్పన కోసం అలాట్ చేశారు. ప్రతి బ్లాక్‌కు 2 లిఫ్ట్‌ల చొప్పున మొత్తం 234 లిఫ్ట్‌లను ఏర్పరిచారు.