Page Loader
ఓఆర్‌ఆర్‌పై 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్.. దూసుకెళ్లనున్న వాహనాలు 
ఓఆర్‌ఆర్‌పై 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్

ఓఆర్‌ఆర్‌పై 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్.. దూసుకెళ్లనున్న వాహనాలు 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 27, 2023
08:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

వేగవంతమైన ప్రయాణానికి హైదరాబాద్ మహానగరం పరిధిలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డు దిక్సూచిగా నిలుస్తోంది. ఈ మేరకు వాహనదారులు మరింత వేగంతో వెళ్లేందుకు తెలంగాణ పురపాలక శాఖ నిర్ణయించింది. ఓఆర్ఆర్ పై ప్రస్తుతానికి గరిష్టంగా 100 కిలోమీటర్ల వేగంతో వాహనాలు దూసుకెళ్తున్నాయి. తాజాగా ఈ వేగాన్ని 120 కిలోమీటర్ల వేగానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆ శాఖ ఉన్నతాధికారులతో పాటు ఓఆర్‌ఆర్‌ అధికారులతోనూ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణికులకు మెరుగైన భద్రతా సౌకర్యాలు కల్పించేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ అన్నారు.

DETAILS

ఏటా ఓఆర్ఆర్ పై రూ.415 కోట్ల ఆదాయం

అనంతరం ఓఆర్ఆర్ పై ప్రభుత్వం తీసుకున్న స్పీడ్ లిమిట్ ను 120 కిలోమీటర్లకు పెంచామని పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ వెల్లడించారు. అయితే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్ ను అప్పగించే అంశంలో రాజకీయ విమర్శల పర్వం కొనసాగుతోంది. తెలంగాణ ప్రభుత్వం టోల్ టెండర్ విషయంలో భారీ అవినీతికి పాల్పడిందని అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఏటా ఓఆర్ఆర్ పై రూ.415 కోట్ల ఆదాయం వస్తుందన్నారు. ఏటా 5 శాతం పెరిగినా 30 ఏళ్లకు ప్రభుత్వానికి దాదాపు రూ. 30 వేల కోట్లు సమకూరేవన్నారు. స్వప్రయోజనాలతో రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని, దీనిపై విచారణ జరిపించాలని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.