Telangana: శాసనసభలో అయిదు బిల్లులను ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో సోమవారం అయిదు ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెట్టింది. ఇవి గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలను ప్రాతిపదికగా ఉంచుకుని, వివిధ చట్టాల్లో సవరణలు చేయడం కోసం జారీచేసిన ఆర్డినెన్స్‌ల ఆధారంగా రూపొందించబడ్డాయి. ఈ బిల్లులలో ముఖ్యంగా 'తెలంగాణ జీతాలు, పింఛను చెల్లింపు, అనర్హతల తొలగింపు బిల్లు', 'పురపాలక సంఘాల బిల్లు', 'జీహెచ్‌ఎంసీ బిల్లు', 'వస్తువులు, సేవల పన్ను బిల్లు', 'పంచాయతీరాజ్ సవరణ బిల్లు'లను ప్రవేశపెట్టింది.
తెలంగాణ మున్సిపాలిటీలు, పంచాయతీరాజ్ చట్టాల్లో కూడా సవరణలు
అంతేకాకుండా, విపత్తు ప్రతిస్పందన, ఆస్తుల పరిరక్షణ వంటి అంశాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏజెన్సీల సేవలను ఉపయోగించుకునేందుకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు అవసరమైన అధికారం కల్పించే చట్టంలో సవరణలు చేస్తారు. మరోవైపు, ఓఆర్‌ఆర్‌లో ఉన్న స్థానిక సంస్థల పునరేవ్యవస్థీకరణకు సంబంధించి తెలంగాణ మున్సిపాలిటీలు, పంచాయతీరాజ్ చట్టాల్లో కూడా సవరణలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.