
Telangana High court: కాళేశ్వరంపై సీబీఐ విచారణకు హైకోర్టు బ్రేక్
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్,మాజీ మంత్రి హరీశ్ రావులకు స్వల్ప ఊరట లభించింది. కాళేశ్వరంపై సీబీఐ విచారణను తాత్కాలికంగా నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది.కోర్టు అక్టోబర్ 7 వరకు ఎలాంటి చర్యలు తీసుకోకూడదని స్పష్టంగా చెప్పింది. అదేవిధంగా,ఈ కేసులో తదుపరి విచారణ వరకు తెలంగాణ ప్రభుత్వం ఏ తొందరపాటు చర్యలు తీసుకోకూడదని హైకోర్టు సూచించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో ఏర్పడిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ నివేదికను ప్రభుత్వం ఆదివారం అసెంబ్లీలో సమర్పించిన విషయం తెలిసిందే. ఈనివేదికపై వివరణాత్మక చర్చ అనంతరం,కేసును సీబీఐకు పంపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కమిషన్ నివేదిక ఆధారంగా తమపై ఏదైనా చర్య తీసుకోకూడదని కేసీఆర్,హరీశ్ రావు హైకోర్టును ఆశ్రయించారు. మంగళవారం ఈ పిటిషన్లను హైకోర్టు పరిశీలించింది.
వివరాలు
కోర్టుకు నేషనల్ డ్యామ్ సేప్టీ అథారిటీ ఇరిగేషన్ శాఖ రిపోర్ట్
ఏజీ సుందర్శన్ రెడ్డి హైకోర్టుకు వివరణ ఇచ్చి, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా మాత్రమే కేసు సీబీఐకు ఇచ్చే నిర్ణయం తీసుకోవడం జరిగిందని,అన్ని నివేదికలను సమీక్షించిన తరువాత మాత్రమే దర్యాప్తు ప్రారంభమయ్యిందని వివరించారు. నేషనల్ డ్యామ్ సేప్టీ అథారిటీ ఇరిగేషన్ శాఖ రిపోర్ట్‌ను కూడా కోర్టుకు సమర్పించారు. అసెంబ్లీలో కాళేశ్వరం నివేదికపై చర్చ జరిగిన తర్వాత, ప్రభుత్వం సీబీఐకి దర్యాప్తు చేయాలని నిర్ణయించిందని, ఇంకా ఏ యాక్షన్ చేపట్టబడలేదని ఏజీ కోర్టుకు తెలియజేశారు. హైకోర్టు ఈ వివరాలను పరిశీలించిన తర్వాత,తదుపరి విచారణకు ముందే ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టంగా ఆదేశించింది. తదుపరి విచారణ తేదీగా అక్టోబర్ 7ని హైకోర్టు వాయిదా వేసింది.