Page Loader
Danam Nagender: ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు జారీ 
ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు జారీ

Danam Nagender: ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు జారీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 22, 2024
03:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఖైరతాబాద్ ఎమ్యెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అయన ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టి దానం నాగేందర్‌కు నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దానం నాగేందర్‌ ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారని, ఓటర్లకు డబ్బులు పంచారని, కేసు నమోదు చేశారని కోర్టుకు వివరించామని విజయారెడ్డి తరపు న్యాయవాది తెలిపారు. వాదనలు నమోదు చేసిన ధర్మాసనం దానం నాగేందర్‌కు నోటీసులు జారీ చేసింది.

Details 

 రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లోకి దానం 

2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్ తరపున పోటీ చేసిన దానం నాగేందర్ బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డిపై గెలుపొందారు. 2024 మార్చి 17న బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా దానం నాగేందర్‌ను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.