
Inter Exam Results: ఈ నెల 22వ తేదీ తెలంగాణ ఇంటర్ ఫలితాలు..
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాల కోసం విద్యార్థులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా,వాటిని విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు పూర్తిగా సిద్ధమైంది.
ఈ నెల 22వ తేదీన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నట్లు అధికారిక సమాచారం.
ఇంటర్ ఫస్ట్ ఇయర్,సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి ప్రకటించనున్నారు.
నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో, 22వ తేదీన ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫలితాలను ప్రకటించనున్నారని ఇంటర్ బోర్డు వెల్లడించింది.
ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్యతో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొనే అవకాశం ఉంది.
ఫలితాలు ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్లు tsbie.cgg.gov.in లేదా results.cgg.gov.in లో అందుబాటులో ఉండనున్నాయి.
వివరాలు
విద్యార్థులకు రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ అవకాశాలు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 5వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నిర్వహించారు.
మొత్తం 9,96,971 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.
మార్చి 18వ తేదీ నుంచి 19 ఎగ్జామినేషన్ సెంటర్లలో స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభమై, నిర్ణీత గడువులో ఫలితాలు విడుదల చేయాలనే లక్ష్యంతో ఇంటర్ బోర్డు సమర్థవంతమైన చర్యలు చేపట్టింది.
ఈసారి ప్రత్యేకతగా, తొలిసారిగా ర్యాండమ్ రీవాల్యుయేషన్ నిర్వహించి,ఫలితాల్లో అచ్చుదిద్దులేమీ ఉండకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఫలితాల విడుదల అనంతరం, విద్యార్థులకు రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ అవకాశాలు కూడా కల్పించనున్నారు.
అంతేకాదు, ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం నెల రోజుల్లో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించే ఏర్పాట్లు కూడా బోర్డు చేపట్టుతోంది.