తదుపరి వార్తా కథనం

Telangana Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాల డేట్ వెల్లడించిన విద్యాశాఖ
వ్రాసిన వారు
Stalin
Apr 21, 2024
02:25 pm
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ(Telangana)ఇంటర్(Inter)విద్యార్థులకు ఇంటర్ బోర్డు తీపి వార్తను అందజేసింది.
ఇంటర్మీయెట్ పరీక్షా ఫలితాలను ఈనెల 24న విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.
ఏప్రిల్ 24న ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండియర్ పరీక్ష ఫలితాలను ఒకేసారి వెల్లడిస్తామని తెలిపింది.
ఈ ఏడాది జరిగిన ఇంటర్ బోర్డు ఎగ్జామ్స్ కు 9,80,978 మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఇందులో 4,78,542 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు, 4,43,993 మంది ఇంటర్ సెకండియర్ విద్యార్థులు న్నారు.
జవాబు పత్రాలను మార్చి 10 నుంచి మూల్యాంకనం చేయడం ప్రారంభించి ఏప్రిల్ 10 ముగించారు.
అనంతరం మార్కుల నమోదుతో పాటు టెక్నికల్ ప్రాబ్లెమ్స్ తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు.
అనంతరం కోడింగ్, డీకోడింగ్ ప్రక్రియ పూర్తయింది.
మీరు పూర్తి చేశారు