Revanth Reddy : అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న తెలంగాణ : సీఎం రేవంత్ రెడ్డి
ఈ వార్తాకథనం ఏంటి
కొత్త రాష్ట్రంగా వెలుగులోకి వచ్చిన తెలంగాణ వేగంగా అభివృద్ధి దిశగా సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. 2047 నాటికి రాష్ట్ర భవిష్యత్ దిశను నిర్ణయించుకునే కొత్త లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని అన్నారు. అప్పటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మలచడం తమ ప్రధాన ఆశయమని పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్' ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ ప్రసంగించారు. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికపై పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు తమ ఆలోచనలు, సూచనలందించాలని కోరారు.
Details
దేశ జీడీపీలో రాష్ట్ర వాటా 10 శాతం ఉండాలి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా 2047 నాటికి దేశాన్ని 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నదని గుర్తుచేశారు. ఆ లక్ష్యంలో తెలంగాణ కీలక పాత్ర పోషించాలని, దేశ జీడీపీలో రాష్ట్ర వాటా 10 శాతం ఉండాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.