Telangana Jagruthi: పురపాలక ఎన్నికల బరిలో తెలంగాణ జాగృతి పార్టీ
ఈ వార్తాకథనం ఏంటి
త్వరలో జరగనున్న పురపాలక సంఘ ఎన్నికల్లో పోటీ చేయాలని తెలంగాణ జాగృతి నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో పార్టీని అధికారికంగా రాజకీయ పార్టీగా నమోదు చేసుకునే ప్రక్రియను నేతలు వేగవంతం చేశారు. అయితే పార్టీ రిజిస్ట్రేషన్ పూర్తవడానికి సుమారు మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉండటంతో, సమీప ఎన్నికల్లో ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకునే దిశగా ఆలోచన చేస్తోంది.
Details
సింహం గుర్తుతో పోటీ చేయాలని నిర్ణయం
ఈ నేపథ్యంలో మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్‌బీ)కు చెందిన 'సింహం' గుర్తుతో పోటీ చేయాలని తెలంగాణ జాగృతి నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై ఏఐఎఫ్‌బీ రాష్ట్ర నాయకత్వంతో ఇప్పటికే చర్చలు జరిపినట్లు సమాచారం. ఉమ్మడి ఎన్నికల గుర్తు కోసం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ బ్యానర్‌పైనే బీఫారంతో అభ్యర్థులను నిలబెట్టే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.