Page Loader
Christmas Holidays: విద్యార్థులకు తెలుగు రాష్ట్రాల సర్కారు వారి గుడ్‌ న్యూస్.. నేటి నుంచి క్రిస్మస్ సెలవులు
నేటి నుంచి క్రిస్మస్ సెలవులు

Christmas Holidays: విద్యార్థులకు తెలుగు రాష్ట్రాల సర్కారు వారి గుడ్‌ న్యూస్.. నేటి నుంచి క్రిస్మస్ సెలవులు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Dec 22, 2023
01:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో క్రిస్మస్ పండగ సందర్భంగా మిషనరీ పాఠశాలలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల డిసెంబరు 22 నుంచి 26 వరకు మిషనరీ స్కూళ్లకు సెలవులు ఉండనున్నాయి.మొత్తం 5 రోజుల పాటు సెల‌వులు ఉండ‌నున్నాయి కొన్ని పాఠశాలలకు ఈ నెల 25, 26 తేదీల్లో మాత్రమే సెలవులను ప్రకటించారు. మరికొన్ని స్కూళ్లకు కేవలం 25న మాత్రమే హాలీడే ఇచ్చారు. డిసెంబరు 26ను రాష్ట్ర ప్రభుత్వం, సాధారణ సెలవుల జాబితాలో చేర్చింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలకు 25, 26 తేదీల్లో సెలవులు ప్రకటించారు. దేశవ్యాప్తంగా పలు చోట్ల డిసెంబరు 23న సెలవు ఉండనుంది. ఈసారి తెలంగాణ‌లో సంక్రాంతి సెల‌వులు నాలుగు నుంచి ఆరు రోజులు పాటు రానున్నాయి.

Details

సంక్రాంతి సెలువులు ఎన్నిరోజులంటే.. 

జ‌న‌వ‌రి 13న రెండో శ‌నివారం చాలా స్కూల్స్‌,కాలేజీల‌కు సెల‌వు ఉంటుంది.అలాగే జ‌న‌వ‌రి 14న భోగి ఆదివారం నాడు వ‌చ్చేస్తోంది. జ‌న‌వ‌రి 15న సంక్రాంతి సందర్భంగా సాధార‌ణంగా సెల‌వు ఉంటుంది.జ‌న‌వ‌రి 16న ఆప్ష‌న‌ల్ హాలిడే ఇచ్చారు. దీంతో దాదాపు 6 రోజులు పాటు స్కూల్స్, కాలేజీల‌కు సెలవులు వ‌చ్చే అవ‌కాశం ఉంది. కొత్త సంవత్సరం రెండు రోజుల సెల‌వులు.. మరికొన్ని రోజుల్లో న్యూ ఇయర్ ప్రారంభంకానుంది.2024కొత్త సంవత్సరం సోమ‌వారం వ‌చ్చింది. దీంతో న్యూఇయర్‌కి వ‌రుస‌గా 2రోజులు పాటు సెల‌వులు రానున్నాయి. డిసెంబ‌ర్ 31ఆదివారం,జ‌న‌వ‌రి 1న సోమ‌వారం కనుక వ‌రుస‌గా 2రోజులు పాటు సెల‌వులు రానున్నాయి. అయితే తెలంగాణ ప్ర‌భుత్వం మాత్రం జ‌న‌వ‌రి 1న ఇచ్చిన సెల‌వును,ఫిబ్ర‌వ‌రి 10న రెండో శ‌నివారం ప‌నిదినంగా ప్ర‌క‌టించింది.

 details

శుక్రవారం రిపబ్లిక్ డే..  

జ‌న‌వ‌రి 26న రిపబ్లిక్ డే సందర్బంగా స్కూల్స్‌, కాలేజీల‌కు, ఆఫీస్‌ల‌కు ప్ర‌భుత్వం సెలవు ప్ర‌క‌టించింది. ఆదివారాలు, రెండో శనివారం, నాల్గో శ‌నివారం కలిపితే బోలెడు సెలవులు జనవరి నెల‌లో రానున్నాయి. ఈ ప్ర‌కారంగా చూస్తే వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి నెలలో సెలవులకు ఢోకా లేదు. మొత్తంగా చూస్తే 2024 జ‌న‌వ‌రి నెల‌లో దాదాపు 11 నుంచి 13 రోజులు పాటు సెల‌వులు రానున్నాయి. ఆంధ్రలో సంక్రాంతి : ఏపీలో జ‌న‌వ‌రి 13న రెండో శ‌నివారం సెల‌వు ఉంటుంది. అలాగే జ‌న‌వ‌రి 14న భోగి, 15న సోమవారం సంక్రాంతి పండ‌గ‌ వచ్చింది. జ‌న‌వ‌రి 16న ఆప్ష‌న‌ల్ హాలిడే ఇచ్చారు. దీంతో స్కూళ్లు, కాలేజీల‌కు దాదాపు 6 రోజులు పాటు సెలవులు వ‌చ్చే అవ‌కాశం ఉంది.