Page Loader
Minister KTR: కేటీఆర్​కు తప్పిన ఘోర ప్రమాదం.. ప్రచార రథంపై నుంచి కిందపడ్డ మంత్రి
ప్రచార రథంపై నుంచి కిందపడ్డ మంత్రి

Minister KTR: కేటీఆర్​కు తప్పిన ఘోర ప్రమాదం.. ప్రచార రథంపై నుంచి కిందపడ్డ మంత్రి

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 09, 2023
04:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్‌ ఎన్నికల ప్రచారంలో మంత్రి కేటీఆర్ తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. ఈ మేరకు ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. ప్రచారం రథంపై నామినేషన్‌ దాఖలు చేసేందుకు బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డితో కలిసి వెళ్తుండగా డ్రైవర్ సడెన్‌ బ్రేక్ వేశారు. దీంతో పైన గ్రిల్ వంగిపోయి నేతలు కిందపడిపోయారు. ఈ క్రమంలోనే కేటీఆర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. పట్టణంలోని పాత ఆలూరు రోడ్ వద్ద జరిగిన ఈ ఘటనలో కేటీఆర్‌ సహా రాజ్యసభ సభ్యుడు సురేశ్ రెడ్డి,ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రథం నుంచి కిందపడ్డారు. ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అదృష్టవశాత్తు ప్రమాదం జరగలేదని, ఎవరూ ఆందోళన చెందకూడదని కేటీఆర్ కోరారు.అనంతరం కొడంగల్ పర్యటనకు బయల్దేరారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రచార రథంపై నుంచి కిందపడ్డ మంత్రి