LOADING...
TG News: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఫిబ్రవరి 11న పోలింగ్
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఫిబ్రవరి 11న పోలింగ్

TG News: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఫిబ్రవరి 11న పోలింగ్

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 27, 2026
04:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలోని ఏడు నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ సందర్భంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని సమావేశం నిర్వహించి, అనంతరం షెడ్యూల్‌ను విడుదల చేశారు. షెడ్యూల్ వెలువడిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.

వివరాలు 

రాష్ట్రవ్యాప్తంగా 53 లక్షల మందికి పైగా ఓటర్లు..

ఈ నెల 28వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండగా, 30వ తేదీతో ఆ ప్రక్రియ ముగియనుంది. మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 53 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించనుండగా, ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఎక్కడైనా రీపోలింగ్ అవసరం ఉంటే, ఫిబ్రవరి 12న నిర్వహిస్తామని ఎన్నికల అధికారులు వెల్లడించారు.

Advertisement