తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా, ఎన్నికల కోడ్ కారణం
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చింది. దీంతో ఫిబ్రవరి 17న జరగాల్సిన తెలంగాణ నూతన సచివాలయ భవన ప్రారంభోత్సవం వాయిదా పడింది.
భారత ఎన్నికల సంఘం సూచన మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఒక ఉపాధ్యాయ, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గం సహా మొత్తం రెండు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
తెలంగాణ
త్వరలో తదుపరి ప్రారంభోత్సవ తేదీ ప్రకటన
ఫిబ్రవరి 9న ఎన్నికల షెడ్యుల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 17న నిర్ణయించిన సచివాలయ ప్రారంభోత్సవంపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, కేంద్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదించారు. కమిషన్ నుంచి స్పందన ఆశాజనకంగా లేకపోవడంతో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. తదుపరి ప్రారంభోత్సవ తేదీని త్వరలో ప్రకటించనున్నారు. ఎన్నికల షెడ్యుల్ ఇలా..
ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ విడుదల
ఫిబ్రవరి 23 వరకు నామినేషన్ల స్వీకరణ
మార్చి 13న పోలింగ్
మార్చి 16న కౌంటింగ్, ఫలితాల ప్రకటన