Telangana Police: ఆల్ ఇండియా పోలీస్ బ్యాండ్ పోటీల్లో తెలంగాణ పోలీసులకు రజతం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Nov 22, 2026
04:50 pm
ఈ వార్తాకథనం ఏంటి
27వ ఆల్ ఇండియా పోలీస్ బ్యాండ్ పోటీలు (2026-27)లో తెలంగాణ పోలీస్ బిగిల్ బృందం రజత పతకం సాధించింది. ఈ విజయంపై డీజీపీ సీవీ ఆనంద్ బృంద సభ్యులను అభినందించారు. హైదరాబాద్లోని సీఆర్పీఎఫ్ గ్రూప్ సెంటర్లో నవంబరు 16 నుంచి 20 వరకు ఈ పోటీలు జరిగాయి. వీటిలో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పోలీస్ బలగాలకు చెందిన బ్యాండ్, బిగిల్ బృందాలు పాల్గొన్నాయి. జాతీయ స్థాయి పోటీల్లో బిగిల్ విభాగంలో తెలంగాణ పోలీస్ బృందం ప్రతిభ కనబరిచి రజత పతకం సాధించడం గర్వకారణమని డీజీపీ పేర్కొన్నారు.
వివరాలు
మరిన్ని విజయాలే లక్ష్యం
ఈ సందర్భంగా మాట్లాడిన సీవీ ఆనంద్.. భవిష్యత్తులో తెలంగాణ పోలీస్ బిగిల్, బ్యాండ్ బృందాలను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు.