Page Loader
 తెలంగాణ: వేసవిలో రికార్డు స్థాయిలో వర్షాపాతం; 40ఏళ్ల తర్వాత తొలిసారిగా!
తెలంగాణ: వేసవిలో రికార్డు స్థాయిలో వర్షాపాతం; 40ఏళ్ల తర్వాత తొలిసారిగా!

 తెలంగాణ: వేసవిలో రికార్డు స్థాయిలో వర్షాపాతం; 40ఏళ్ల తర్వాత తొలిసారిగా!

వ్రాసిన వారు Stalin
May 09, 2023
12:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

2023లో వేసవి కాలం వానాకాలాన్ని తలపిస్తోంది. తెలంగాణలో భారీగా కురుస్తున్న అకాల వర్షాలు వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చేశాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది వేసవిలో వర్షాపాతం నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత 40ఏళ్ల చరిత్రలో ఈ స్థాయిలో వర్షాలు పడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ వేసవిలో అంటే ఏప్రిల్‌తో పాటు మే 5వ తేదీ నాటికి తెలంగాణలో సాధారణం కంటే 54శాతం ఎక్కువ వర్షాపాతం నమోదైంది.

తెలంగాణ

1359.7మిల్లీ మీటర్ల వర్షాపాతం 

తెలంగాణ సాధారణ వర్షాపాతం 908.3మిల్లీ మీటర్లు అని వాతావరణ శాఖ చెబుతోంది. అయితే గతేడాది జూన్ నుంచి ఈ ఏడాది మే 5వ తేదీ నాటికి 1359.7మిల్లీ మీటర్ల వర్షాపాతం నమోదైంది. ఈ మధ్యకాలంలో ఈస్థాయిలో వర్షాలు కురవడం ఇదే తొలిసారి. చివరిసారిగా 1983-84లో 1351.1 మిల్లీ మీటర్ల వర్షాపాతం నమోదైంది. ఆ ఏడాది సాధారణం కంటే దాదాపు 51శాతం వర్షాపాతం ఎక్కువ నమోదైంది. దాదాపు 40ఏళ్ల తర్వాత 2022-23లో రికార్డు స్థాయిలో వర్షాపాతం నమోదైంది.