Telangana: తెలంగాణలో కులగణన వివరాలు ప్రకటించిన ప్రభుత్వం.. బీసీలు 56.33 శాతం, ఎస్సీలు 17.43
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో అన్ని కులాల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ప్రజల ముందుంచింది. గతంలో ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీల జనాభా లెక్కలనే వెల్లడించిన ప్రభుత్వం,ఇప్పుడు ప్రతి కులానికి చెందిన జనాభా వివరాలను స్పష్టంగా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపడతామని ప్రకటించిన నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రాత్రి ఈ గణాంకాలను విడుదల చేసింది. కులగణనలో సేకరించిన ఆర్థిక, సామాజిక, విద్యా, రాజకీయ అంశాలకు సంబంధించిన సమాచారం కూడా వెల్లడించింది. రాష్ట్ర మొత్తం జనాభాలో బీసీలు 56.33 శాతం ఉన్నారు. ఇందులో వెనుకబడిన ముస్లింలు 10.08 శాతం ఉన్నారు. ఎస్సీలు 17.43 శాతం, ఎస్టీలు 10.45 శాతం, ఓసీలు 15.79 శాతం ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు.
వివరాలు
56 ప్రధాన కులాల మధ్య భారీ అసమానతలు..
రాష్ట్రంలోని 56 ప్రధాన కులాల మధ్య వెనుకబాటుతనం విషయంలో గణనీయమైన తేడాలు ఉన్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.
బీసీలలోని కొన్ని వర్గాలు సామాజిక, ఆర్థికంగా ఓసీ వర్గాలతో సమాన స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు.
రాష్ట్ర సగటు వెనుకబాటుతనంతో పోలిస్తే ఎస్సీ క్రైస్తవులు, కంసాలీలు మెరుగైన స్థాయిలో ఉన్నారు.
కులాంతర వివాహాలు అన్ని వర్గాల్లో పెరుగుతున్న ధోరణి కనిపిస్తోందని నివేదిక తెలిపింది.
ఈ వివరాలను రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు విడుదల చేశారు.
ప్రజలు ఈ గణాంకాలను రాష్ట్ర అధికారిక గణాంకాల వెబ్‌సైట్‌లో చూడవచ్చని తెలిపారు.
వివరాలు
అత్యధిక జనాభా ఉన్న కులాలు
కులం జనాభా (శాతం)
మాదిగ 36,57,551 (10.3శాతం)
ముదిరాజ్ 26,39,027 (7.4శాతం)
లంబాడీ/బంజారా 24,04,056 (6.8శాతం)
యాదవ 20,18,725 (5.7శాతం)
రెడ్డి 17,10,244 (4.8శాతం)
గౌడ 16,30,187 (4.6శాతం)
మాల 14,71,514 (4.1శాతం)
మున్నూరుకాపు 13,75,018 (3.9శాతం)
పద్మశాలి 11,82,252 (3.3శాతం)
వర్గాల వారీగా మొత్తం జనాభా
ఎస్సీ 61,84,319 17.43
ఎస్టీ 37,05,929 10.45
బీసీ (ముస్లిం మినహా) 1,64,09,179 46.25
ముస్లిం మైనార్టీ (బీసీ) 35,76,588 10.08
ముస్లిం మైనార్టీ (ఓసీ) 8,80,424 2.48 ముస్లిం మైనార్టీ (మొత్తం) 44,57,012 12.56 ఓసీ (ముస్లిం మైనార్టీ) 8,80,424 2.48 ఇతర ఓసీలు 47,21,115 13.31 మొత్తం ఓసీలు 56,01,539 15.79