LOADING...
TGSRTC: తెలంగాణ ఆర్టీసీ బంపరాఫర్‌.. హైదరాబాద్-విజయవాడ బస్సుల్లో టికెట్ ధరల తగ్గింపు!
తెలంగాణ ఆర్టీసీ బంపరాఫర్‌.. హైదరాబాద్-విజయవాడ బస్సుల్లో టికెట్ ధరల తగ్గింపు!

TGSRTC: తెలంగాణ ఆర్టీసీ బంపరాఫర్‌.. హైదరాబాద్-విజయవాడ బస్సుల్లో టికెట్ ధరల తగ్గింపు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 28, 2025
04:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో ప్రయాణించే వారికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) తీపి కబురు అందించింది. ఈ రూట్‌లో నడిచే తమ బస్సుల్లో టికెట్ ధరలపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. టికెట్ రేట్లపై కనీసం 16 శాతం నుంచి గరిష్ఠంగా 30 శాతం వరకు రాయితీ అందించనున్నట్లు సంస్థ "ఎక్స్‌"లో పోస్టు చేసింది. ఈ ఆఫర్‌లో భాగంగా గరుడ ప్లస్ బస్సుల్లో టికెట్‌ ధరపై 30శాతం రాయితీ, ఈ-గరుడ బస్సుల్లో 26శాతం డిస్కౌంట్, సూపర్ లగ్జరీ, లహరి నాన్‌ ఏసీ బస్సుల్లో 20శాతం తగ్గింపు, రాజధాని, లహరి ఏసీ బస్సుల్లో 16శాతం డిస్కౌంట్‌ను అందించనున్నారు.

Details

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బుకింగ్‌లపై వర్తింపు

ఈ ఆఫర్లు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బుకింగ్‌లపై వర్తించనున్నాయని పేర్కొన్నారు. ప్రయాణికులు తమ టికెట్లు అధికారిక వెబ్‌సైట్ అయిన [http://tgsrtcbus.in](http://tgsrtcbus.in) ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇలాంటి ప్రయాణ సదుపాయాలపై మరింత సమాచారం కోసం టీజీఎస్ ఆర్టీసీ అధికారిక వేదికలను సందర్శించవచ్చు.