Page Loader
DGP Ravi Gupta: తెలంగాణలో 8.97 శాతం పెరిగిన 2023లో నేరాల రేటు.. ఇయర్ అండ్ రివ్యూలో డీజీపీ రవిగుప్తా
DGP Ravi Gupta: తెలంగాణలో 8.97 శాతం పెరిగిన 2023లో నేరాల రేటు.. ఇయర్ అండ్ రివ్యూలో డీజీపీ రవిగుప్తా

DGP Ravi Gupta: తెలంగాణలో 8.97 శాతం పెరిగిన 2023లో నేరాల రేటు.. ఇయర్ అండ్ రివ్యూలో డీజీపీ రవిగుప్తా

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 29, 2023
02:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్ర పోలీసు వార్షిక రౌండ్-అప్ కాన్ఫరెన్స్ 2023 తర్వాత, DGP రవి గుప్తా మాట్లాడుతూ.. 2022తో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో నేరాల రేటు 8.97 శాతానికి పెరిగిందన్నారు. ఈ ఏడాది 2,13,121 కేసులు నమోదయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం నేరాల రేటులో సైబర్ నేరాలు 17.59 శాతానికి పెరిగాయని డీజీపీ తెలిపారు. ఈ ఏడాది 1108లో జీరో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా, ఐపీసీ సెక్షన్‌ కింద 1,38,312 కేసులు నమోదు చేసినట్లు డీజీపీ రవిగుప్తా వెల్లడించారు. మహిళలు పై వేధింపులకు సంబదించిన కేసులలో 19013 నమోదు కాగా.. ఇందులో 2284 రేప్ కేసులు, 33 వరకట్న, హత్యలు, 132 వరకట్న మరణాలు, 9458 వరకట్న వేధింపుల కేసులు నమోదయ్యాయని తెలిపారు.

Details 

1 శాతం తగ్గిన రోడ్డు ప్రమాదాలు

ఇక మహిళలు హత్యలు 213, 884 మహిళ కిడ్నాప్ లు కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది పొక్సో కేసులు 2426, ఒక నిందితుడు కి మరణ శిక్ష విధింపు, 104 మందికి జీవిత ఖైదీ శిక్షలు విధించారని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే రోడ్డు ప్రమాదాలు1 శాతం తగ్గాయి.గత ఏడాది 6432 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, ఈ ఏడాది 6,362 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఘోర రోడ్డు ప్రమాదాలు కూడా ఈ ఏడాది 2410 నుంచి 969కి 60 శాతం తగ్గాయి. మొత్తం నేరారోపణ రేటు 41 శాతం కాగా, ఈ ఏడాది జీవిత ఖైదు 39 శాతం పెరిగిందన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మీడియాతో మాట్లాడుతున్న డీజీపీ రవిగుప్తా