Page Loader
తెలంగాణ: నిర్మాణంలో ఉన్న స్టేడియం కూలి ఇద్దరు మృతి 

తెలంగాణ: నిర్మాణంలో ఉన్న స్టేడియం కూలి ఇద్దరు మృతి 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 20, 2023
04:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కనకమామిడిలో నిర్మాణంలో ఉన్న ఇండోర్ స్టేడియం కుప్పకూలడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన చోటుచేసుకుంది. టేబుల్ టెన్నిస్ అకాడమీ నిర్మాణ పనుల సమయంలో స్లాబ్ కూలిపోయింది. సుమారు 14 మంది కూలీలు ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది.ఈ ప్రమాదంలో 10 మందికి పైగా గాయపడ్డారు. రాజేందర్‌నగర్ పోలీస్ డిప్యూటీ కమిషనర్ జగదీశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మృతుల్లో ఒకరి మృతదేహం లభ్యమైందని, మరో మృతదేహాన్ని శిథిలాల నుంచి వెలికితీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణంలో ఉన్న స్టేడియం కూలి ఇద్దరు మృతి