Page Loader
టీఎస్పీఎస్సీ లీకేజీలో నాంపల్లి కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన సిట్.. రూ.1.63 కోట్ల లావాదేవీలు సీజ్ 
రూ.1.63 కోట్ల లావాదేవీలు సీజ్

టీఎస్పీఎస్సీ లీకేజీలో నాంపల్లి కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన సిట్.. రూ.1.63 కోట్ల లావాదేవీలు సీజ్ 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 09, 2023
07:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో నాంపల్లి కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలైంది. ఈ మేరకు సిట్‌ అధికారులు దాఖలు చేశారు. మొత్తంగా ఇప్పటివరకు ఈ కేసులో రూ.1.63 కోట్ల మేర లావాదేవీలు జరిగాయని విచారణలో తేలిందన్నారు. నిందితులకు సంబంధించిన అకౌంట్ వివరాలు, చేతుల మారిన నగదుకు సంబంధించిన వివరాలను ఇప్పటికే తాము స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇంకా కొందరిని అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 49 మందిని ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు అరెస్టు చేశారు. అయితే వీరిలో దాదాపు 16 మంది మధ్యవర్తులుగా ఉన్నట్లు నిగ్గుతేల్చామని ఛార్జ్‌షీట్‌లో రాసుకొచ్చారు.

DETAILS

విశ్లేషణ నిమిత్తం ఫోరెనిక్స్‌ సైన్స్‌ ల్యాబ్ కి తరలించాం : సిట్

మరో నిందితుడు ప్రశాంత్‌ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రాసి న్యూజిలాండ్‌లో ఉన్నాడని తెలిపారు. ఇక ఇంజనీరింగ్ కు సంబంధించి ఏఈఈ పేపర్ లీకేజీ 13 మందికి, డీఏవో పేపర్‌ 8 మందికి, గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ నలుగురికి చేరినట్లు నిర్థారించారు. గ్రూప్‌-1 నలుగురు నిందితుల్లో టీఎస్‌పీఎస్సీలోనే ముగ్గురు ఉద్యోగులు పనిచేస్తారని, మరొకరు బయటి వ్యక్తి అని తేలిందన్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో దశలోనే ఉన్నట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. మరోవైపు డీఈ పూల రమేష్‌ సపోర్టుతో ఏఈఈ, డీఏవో పరీక్షల్లో కాపియింగ్ కు పాల్పడ్డ ముగ్గురిని అరెస్టు చేశామన్నారు. అనంతరం నిందితుల మొబైల్‌, ఎలక్ట్రానిక్‌ పరికరాలను రామంతాపూర్‌ ఫోరెనిక్స్‌ సైన్స్‌ ల్యాబ్ కి తరలించామన్నారు. ఫలితంగా అదనపు సమాచారం లభించిందని, ఈ మేరకు అరెస్టుల సంఖ్య పెరిగనుందన్నారు.