LOADING...
Bhatti Vikramarka : పరిపాలనలో AI విప్లవానికి తొలి అడుగు వేసిన తెలంగాణ
పరిపాలనలో AI విప్లవానికి తొలి అడుగు వేసిన తెలంగాణ

Bhatti Vikramarka : పరిపాలనలో AI విప్లవానికి తొలి అడుగు వేసిన తెలంగాణ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 26, 2025
05:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శనివారం గవర్నింగ్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దూడ శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. వైద్య శాంతి కుమారి (ఎంసీఆర్హెచ్ఆర్డీ వైస్ చైర్‌పర్సన్), ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్ అండ్ బీ ఈఎన్‌సి జయభారతి తదితర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ... ఎంసీఆర్హెచ్ఆర్డీని దేశంలోనే అత్యుత్తమ శిక్షణ సంస్థగా అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఆ దిశగా ప్రభుత్వమంతటా పూర్తి మద్దతు ఉంటుందన్నారు. సంస్థ స్వయం సమృద్ధి సాధించేందుకు, ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

Details

రెండ్రోజులు పాటు శిక్షణ ఇవ్వాలి

పరిపాలన వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగాన్ని పెంపొందించాలన్న లక్ష్యాన్ని ఆయన ప్రస్తావించారు. దేశంలోనే మొట్టమొదట పరిపాలనలో AIను సమగ్రంగా అమలు చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలవాలని ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి నుంచి గ్రామస్థాయి అధికారుల వరకు అందరికీ తగిన శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. అలాగే, స్వయం సహాయక సంఘాల నాయకులకు జిల్లాలవారీగా, మండలాలవారీగా రెండు రోజులపాటు శిక్షణ ఇవ్వాలని, వారు ఆర్థికంగా స్వయం భద్రత గలవారిగా ఎదగేందుకు అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. గత పదేళ్లుగా ఎంసీఆర్హెచ్ఆర్డీ పట్ల తగిన దృష్టి పెట్టలేదని గుర్తు చేసిన ఆయన, ఇకపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి సబ్-కమిటీ సమావేశాలు నిర్వహించాలని స్పష్టంగా ప్రకటించారు.