LOADING...
TS TET 2025 Hall Tickets: తెలంగాణ టెట్‌ హాల్‌టికెట్లు నేడే విడుదల.. ఎక్కడ, ఎలా డౌన్‌లోడ్‌ చేయాలంటే? 
తెలంగాణ టెట్‌ హాల్‌టికెట్లు నేడే విడుదల.. ఎక్కడ, ఎలా డౌన్‌లోడ్‌ చేయాలంటే?

TS TET 2025 Hall Tickets: తెలంగాణ టెట్‌ హాల్‌టికెట్లు నేడే విడుదల.. ఎక్కడ, ఎలా డౌన్‌లోడ్‌ చేయాలంటే? 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 11, 2025
09:02 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించనున్న టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) 2025 జూన్‌ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు బుధవారం జూన్‌ 11న విడుదల కానున్నాయి. ఈ విషయాన్ని విద్యాశాఖ స్పష్టంగా వెల్లడించింది. హాల్‌టికెట్లు విడుదలకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసిన విద్యాశాఖ, అభ్యర్థులు హాల్‌టికెట్లు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపింది. టెట్‌ పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో జరగనున్న ఈ పరీక్షలు జూన్‌ 18 నుంచి జూన్‌ 30 వరకు కొనసాగనున్నాయి. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా 1.66 లక్షల మంది టెట్‌కు దరఖాస్తు చేసుకోగా, మొత్తం 1,83,653 దరఖాస్తులు అందినట్టు వెల్లడించారు. వీటిలో పేపర్‌-1కు46,000, పేపర్‌-2కు 1.03లక్షల దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. రెండు పేపర్లకూ కలిపి 16,000కి పైగా దరఖాస్తు చేశారు.

Details

తెలంగాణ లా సెట్‌ ఫలితాలు జూన్‌ 25న విడుదల

తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన లా కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (టీఎల్‌సెట్‌/పీజీ ఎల్‌సెట్‌) 2025 ఫలితాలను జూన్‌ 25న విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి తాజాగా ప్రకటించింది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్‌ కీని జూన్‌ 10న విడుదల చేశారు. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఆన్సర్‌ కీతో పాటు తమ రెస్పాన్స్‌ షీట్లను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ప్రవేశ పరీక్షలు జూన్‌ 6న నిర్వహించగా, మొత్తం 45,609 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుకు 32,118 మంది, అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ మరియు ఎల్‌ఎల్‌ఎమ్ కోర్సులకు 13,491 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు.

Details

ఏపీ ఎడ్‌సెట్‌ 2025 ప్రాథమిక కీ విడుదల 

ఆంధ్రప్రదేశ్‌ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఏపీ ఎడ్‌సెట్‌) 2025 ప్రాథమిక ఆన్సర్‌ కీను ఏపీఎస్‌సీహెచ్‌ఈ (APSCHE) అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. ఈ కీతో పాటు రెస్పాన్స్‌ షీట్లు, మాస్టర్‌ ప్రశ్నపత్రాన్ని కూడా అందుబాటులోకి తెచ్చింది. అభ్యర్థులు ఆన్సర్‌ కీపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే, వాటిని జూన్‌ 13వ తేదీ లోపు తెలియజేయవచ్చని అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రవేశ పరీక్ష జూన్‌ 5న నిర్వహించారు. ఇక ఫలితాలను జూన్‌ 21న విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఎన్‌ట్రన్స్‌ టెస్ట్‌ ద్వారా 2025-26 విద్యా సంవత్సరానికి బీఈడీ, బీఈడీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.