తదుపరి వార్తా కథనం
Telangana: ప్రభుత్వ పాఠశాలల్లో కూరగాయల సాగు, పండ్ల మొక్కల పెంపకం.. ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రతిపాదన
వ్రాసిన వారు
Sirish Praharaju
Mar 13, 2025
12:48 pm
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభుత్వ పాఠశాలల్లో కూరగాయల సాగు,పండ్ల మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించాలని కొండా లక్ష్మణ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రభుత్వానికి ప్రతిపాదించింది.
ఈ ప్రణాళిక ద్వారా మధ్యాహ్న భోజన పథకానికి అవసరమైన కూరగాయలు, పండ్లు లభ్యం కావడంతో పాటు, విద్యార్థులకు ఉద్యాన విభాగంపై అవగాహన పెరుగుతుందని విశ్వవిద్యాలయం తెలిపింది.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 26,287 ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలులో ఉంది.
ఈ కార్యక్రమం కోసం ప్రతి సంవత్సరం సుమారు రూ.100 కోట్లు కూరగాయలు, పండ్ల కొనుగోలుకు ఖర్చుచేస్తున్నారు.
ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా కూరగాయల తోటలు, పండ్ల తోటల సాగును ప్రారంభించారు.