Telangana: సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. విదేశాల్లో నివసిస్తున్న విద్యార్థుల కోసం హెల్ప్‌డెస్క్ ఏర్పాటు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇతర దేశాల్లో నివసిస్తున్న విద్యార్థుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
అమెరికాలోని చికాగోలో మాస్టర్స్ చదువుతున్న హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ మజర్ అలీ అనే విద్యార్థిని అతని అపార్ట్‌మెంట్ సమీపంలో ముగ్గురు దుండగులు దాడి చేసిన ఘటనపై రేవంత్ రెడ్డి స్పందించారు.
మజర్ అలీపై దొంగలు దాడి చేసిన విషయం తెలిసి విస్తుపోయానని సీఎం అన్నారు.
విదేశాల్లో చదవుతున్న తమ విద్యార్థుల భద్రతపై దృష్టి సారించాలని రేవంత్ రెడ్డి కోరారు.
అలాగే, తెలంగాణ విద్యార్థులు ఈ భూమి మీద ఎక్కడున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికోసం హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ట్వీట్ చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
తెలంగాణ సీఎంఓ ట్వీట్
Very disconcerted to learn of the attack on Syed Mazhar Ali, a student from #Hyderabad, by four robbers in #Chicago. This follows a fatal attack on B. Shreyas Reddy, who was killed in Ohio.
— Telangana CMO (@TelanganaCMO) February 7, 2024
I request Hon'ble External Affairs Minister @DrSJaishankar ji to kindly convey our…