LOADING...
Inflation: మార్చిలో ద్రవ్యోల్బణం పెరుగుదల.. తొలి స్థానాల్లో తెలుగు రాష్ట్రాలు
మార్చిలో ద్రవ్యోల్బణం పెరుగుదల.. తొలి స్థానాల్లో తెలుగు రాష్ట్రాలు

Inflation: మార్చిలో ద్రవ్యోల్బణం పెరుగుదల.. తొలి స్థానాల్లో తెలుగు రాష్ట్రాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 14, 2026
09:08 am

ఈ వార్తాకథనం ఏంటి

మార్చి నెలలో నమోదైన ద్రవ్యోల్బణంలో తెలుగు రాష్ట్రాలు దేశవ్యాప్తంగా ముందంజలో నిలిచాయి. ఆ నెలలో జాతీయ స్థాయిలో సగటు ద్రవ్యోల్బణం 3.40 శాతం నమోదవగా, యాభై లక్షలకు పైగా జనాభా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ 5.83 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ 4.05 శాతంతో రెండో స్థానాన్ని దక్కించుకుంది.ఇవాటి తరువాత కర్ణాటక 3.96 శాతం, తమిళనాడు 3.77 శాతం, రాజస్థాన్ 3.64 శాతంతో వరుసగా తదుపరి స్థానాల్లో నిలిచాయి. మార్చిలో గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 3.63 శాతంగా నమోదై, పట్టణ ప్రాంతాల 3.11 శాతంతో పోలిస్తే ఎక్కువగా ఉంది. ఫిబ్రవరి నెలతో పోలిస్తే మార్చిలో మొత్తం ద్రవ్యోల్బణం 0.19 శాతం పెరిగింది.అలాగే ఆహార సంబంధిత ద్రవ్యోల్బణం 0.4 శాతం మేర పెరిగింది.

వివరాలు 

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం

అయితే వెండి, బంగారం, వజ్రాలు, కొబ్బరి, టమాటా, కాలీఫ్లవర్ ధరలు పెరిగాయి. రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాల్లో 4.14 శాతం, పట్టణ ప్రాంతాల్లో 3.91 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో 6.64 శాతం, పట్టణ ప్రాంతాల్లో 5.24 శాతం నమోదైంది.

వివరాలు 

పట్టణ ద్రవ్యోల్బణంలో తెలంగాణ అగ్రస్థానం

గ్రామీణ ద్రవ్యోల్బణంలో తెలంగాణ 6.64 శాతంతో మొదటి స్థానంలో ఉండగా, కేరళ 4.31 శాతం, మహారాష్ట్ర 4.29 శాతం, కర్ణాటక 4.24 శాతం, ఆంధ్రప్రదేశ్ 4.14 శాతంతో తదుపరి స్థానాల్లో నిలిచాయి. పట్టణ ద్రవ్యోల్బణంలో తెలంగాణ 5.24 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తరువాత హిమాచల్ ప్రదేశ్ 3.93 శాతం, ఆంధ్రప్రదేశ్ 3.91 శాతం, తమిళనాడు 3.72 శాతం, కర్ణాటక 3.68 శాతం వరుసగా చోటు దక్కించుకున్నాయి.

Advertisement