Andhrapradesh: అమరలింగేశ్వర స్వామి ఆలయంలో చోరీ.. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు!
ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా అమరావతి పట్టణంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆలయంలోకి చొరబడి రూ.10,000తో ఉడాయించినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో నిందితుల్లో ఒకరు ఆలయ భవనంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమరలింగేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ఉన్న క్షేత్ర బాల చాముండికా ఆలయ ప్రాంగణంలోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తులు స్టీల్ హుండీని ధ్వంసం చేసి రూ.10వేలు అపహరించారు.
దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు
నిందితులను పట్టుకునేందుకు ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజీల సహాయంతో సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారి తెలిపారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. భక్తులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో 2022లో హుండీ లెక్కింపు సందర్భంగా కనకదుర్గ గుడిలో బంగారు ఆభరణాలు దొంగిలించేందుకు ప్రయత్నించిన వ్యక్తిని విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు.