Page Loader
అన్నమయ్య జిల్లాలో హై టెన్షన్.. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య దాడులు
అన్నమయ్య జిల్లాలో హై టెన్షన్.. టీడీపీ, వైసీపీ శ్రేణుల పరస్పర దాడులు

అన్నమయ్య జిల్లాలో హై టెన్షన్.. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య దాడులు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 04, 2023
06:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీడీపీ అధినేత చంద్రబాబు రాయలసీమ పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగళ్లులో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధబేరి చేపట్టిన ప్రతిపక్ష నేత చంద్రబాబు సీమలో వరుస పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ స్థానికంగా చంద్రబాబు కోసం బ్యానర్లను ఏర్పాటు చేసింది. ఈ బ్యానర్లను వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు చించివేశారు. దీంతో వివాదం రాజుకుంది.

DETAILS

పోలీసులు పట్టించుకోవట్లేదని టిడిపి ఆందోళన

బ్యానర్ల చించివేత ఘటనను అడ్డుకున్న టిడిపి శ్రేణులపై వైసీపీ కార్యకర్తలు దాడులు చేశాయి. ఘర్షణలో మదనపల్లె మండలం కొత్తపల్లి ఎంపీటీసీ దేవేంద్ర, ఇతర టీడీపీ శ్రేణులుగాయపడ్డారు. జెండాలను వైసీపీ కార్యకర్తలు గాల్లోకి తిప్పుతూ తమను రెచ్చగొట్టారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు కర్రలు, రాళ్లతో టిడిపిపై దాడికి దిగినట్లు ఆందోళనకు దిగాయి. అంగళ్లు సెంటర్ వద్దకు ఇరు పార్టీల వారు చేరడంతో వాతావరణం వెడెక్కింది. దీనిపై పోలీసులు సరిగ్గా స్పందించట్లేదని టీడీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేశారు. దాడులకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది.