Udaipur palace: ఉదయ్‌పుర్ కోటలో ఉద్రిక్తతలు.. మహారాజు విశ్వరాజ్ సింగ్‌కు 'నో ఎంట్రీ'
రాజస్థాన్‌లో ఉదయ్‌పుర్ రాజవంశంలో కొత్త మహారాజు పట్టాభిషేకం ఘర్షణలకు దారితీసింది. మహారాజు విశ్వరాజ్ సింగ్ మేవాడ్ (77వ మహారాజు) తన పట్టాభిషేకం సందర్భంగా ఉదయ్‌పుర్ ప్యాలెస్‌లో ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రాజ కుటుంబంలోని ఇతర దాయాదులు ఈ ప్రవేశాన్ని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తడంతో పలువురికి గాయాలయ్యాయి. మహేంద్ర సింగ్ మేవాడ్, 76వ మహారాజు, ఇటీవల మరణించిన తరువాత ఆయన కుమారుడు విశ్వరాజ్ సింగ్‌ను 77వ మహారాజుగా సోమవారం పట్టాభిషేకం చేసిన విషయం తెలిసిందే. సంప్రదాయ ప్రకారం వారి కులదైవం ఏకలింగనాథ్ ఆలయం, ఉదయ్‌పుర్‌లోని సిటీ ప్యాలెస్‌ను సందర్శించాల్సి ఉంటుంది.
భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు
అయితే ఈ పట్టాభిషేకంపై అరవింద్ సింగ్ మేవాడ్ (ప్రస్తుతం రాజ కుటుంబ ట్రస్ట్ ఛైర్మన్) ఆయన వ్యతిరేకంగా ప్రకటన ఇచ్చారు. ఈ నేపథ్యంలో మహారాజు విశ్వరాజ్ సింగ్‌ను కోటలోకి ప్రవేశం చేయకుండా అడ్డుకోవడం కోసం ఆయన వర్గం అడ్డుపడింది. దాంతో ఉదయ్‌పుర్ ప్యాలెస్ వద్ద పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఉదయ్‌పుర్ ప్యాలెస్ వద్ద పెద్ద ఎత్తున ఘర్షణలు చోటు చేసుకోవడంతో ఇరువురి మధ్య రాళ్ల దాడి జరిగింది. పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు.