Jammu and Kashmir: ఉగ్ర ముప్పు హెచ్చరిక.. కశ్మీర్ గండేర్‌బాల్‌లో ఐఈడీ గుర్తింపు
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ సహా దేశంలోని పలు ముఖ్య నగరాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు జమ్మూ కశ్మీర్‌లో గండేర్‌బాల్ జిల్లాలోని ఉగ్ర కుట్రను ముందస్తే భగ్నం చేశాయి. పోలీసులు ఒక బ్యాగులో మంటుపాతర (IED)ను గుర్తించి, వెంటనే బాంబు స్వ్కాడ్ సహాయంతో పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేశారు. అధికారులు మరిన్ని ప్రదేశాల్లో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
Details
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలి
స్థానికులను ఏవైనా అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. నిఘా వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం, దిల్లీ ఎర్రకోట (Red Fort), చాందినీ చౌక్ ప్రాంతాల్లో దాడులు చేపట్టేందుకు పాక్‌కు చెందిన ఉగ్ర సంస్థ లష్కరే తయ్యిబా (LeT) ప్లాన్ చేసినట్లు గుర్తించారు. దేశంలోని ఇతర ప్రముఖ నగరాల్లో, రద్దీగా ఉండే ప్రదేశాల్లో కూడా దాడులు జరిగే అవకాశాన్ని నిఘా వర్గాలు హెచ్చరించారు.