TSPSC Group 2 Hall Tickets :తెలంగాణ గ్రూప్ 2 హాల్ టికెట్లు విడుదల.. డౌన్ లోడ్ లింక్ ఇదే
తెలంగాణ గ్రూప్ 2 హాల్ టికెట్లు విడుదలయ్యాయి. టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 2 హాల్ టికెట్ల లింక్‌ను యాక్టివ్ చేసి, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/ ద్వారా హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 15, 16 తేదీల్లో గ్రూప్ 2 రాత పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1368 పరీక్షా కేంద్రాలలో ఈ పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్) జరగనుంది. టీఎస్‌పీఎస్సీ ప్రకారం, హాల్ టికెట్లు డిసెంబర్ 9వ తేదీ నుండి డౌన్‌లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉంటాయి. ఈ నెల 15వ తేదీ ఉదయం 9 గంటల వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఫోటో,హాల్ టికెట్‌లో ఉన్న ఫోటో ఒకేలా ఉండాలి
పరీక్ష రోజు అభ్యర్థులు ఉదయం సెషన్ కోసం 08:30 గంటల నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతించబడతారు,అయితే 09:30 తర్వాత గేట్లు మూసివేయబడతాయి. మధ్యాహ్నం సెషన్ కోసం 01:30 గంటల నుంచి అనుమతిస్తారు,అయితే 02:30 తర్వాత ఎవ్వరినీ అనుమతించరు. పరీక్షకు నలుపు లేదా నీలం బాల్ పాయింట్ పెన్ను,హాల్ టికెట్ మాత్రమే తీసుకురావాలి. హాల్ టికెట్‌పై తాజా ఫోటో అతికించి, ప్రభుత్వం జారీ చేసిన ఒరిజినల్ ఫోటో ఐడీ కార్డు వెంట తెచ్చుకోవాలి. ఫోటో,హాల్ టికెట్‌లో ఉన్న ఫోటో ఒకేలా ఉండాలి. హాల్ టికెట్‌పై ఫోటో స్పష్టంగా లేకపోతే, టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న అండర్‌టేకింగ్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, మూడు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలను అతికించి,చివరిగా చదివిన విద్యాసంస్థ గెజిటెడ్ అధికారితో ధ్రువీకరింపజేయాలి.
అభ్యర్థులు నియమాలను పాటించాలి
ఈ ఫారమ్‌ను పరీక్షా కేంద్రంలో ఇన్విజిలేటర్‌కు సమర్పించాలి. అభ్యర్థులు పరీక్ష కేంద్రాన్ని ఒక రోజు ముందుగానే సందర్శించి, చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా ముందుగానే ధ్రువీకరించుకోవాలి. అదనపు వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, కాలిక్యులేటర్లు, సెల్‌ఫోన్లు, పేజర్లు, టాబ్లెట్లు, బ్లూటూత్ పరికరాలు, వాచ్‌లు, హ్యాండ్‌బ్యాగ్‌లు, రైటింగ్ ప్యాడ్‌లు, నోట్స్, చార్ట్‌లు, ఆభరణాలు (మంగళసూత్రం, బ్యాంగిల్స్ మినహా) వంటి వస్తువులను పరీక్ష కేంద్రానికి తీసుకురావడాన్ని నిషేధించారు. ఈ నియమాలను పాటించి అభ్యర్థులు పరీక్షను విజయవంతంగా పూర్తిచేయాలని సూచించారు.