LOADING...
TGSRTC: ఏపీకి సంక్రాంతి స్పెషల్ బస్సులు ప్రకటించిన టీజీఎస్ ఆర్టీసీ 
ఏపీకి సంక్రాంతి స్పెషల్ బస్సులు ప్రకటించిన టీజీఎస్ ఆర్టీసీ

TGSRTC: ఏపీకి సంక్రాంతి స్పెషల్ బస్సులు ప్రకటించిన టీజీఎస్ ఆర్టీసీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 30, 2025
12:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగువారికి అతిపెద్ద పండుగ అయిన సంక్రాంతి సందర్భంగా సొంత గ్రామాలకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ (టీజీఎస్ఆర్టీసీ) శుభవార్త అందించింది. రైళ్లలో టికెట్లు దొరకకపోవడం, సాధారణ బస్సులు పూర్తిగా నిండిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలైన బీహెచ్‌ఈఎల్‌, మియాపూర్ వైపు నివసించే వారికి సౌకర్యంగా ఉండేలా బీహెచ్‌ఈఎల్‌ డిపో నుంచి ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్ సర్వీసులను ప్రకటించింది. బీహెచ్‌ఈఎల్‌ డిపో (ఆర్సీపురం) నుంచి ఏపీలోని పలు జిల్లాలకు ఈ ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. ఆర్సీపురం నుంచి బయలుదేరే ఈ బస్సులు మియాపూర్‌, కేపీహెచ్‌బీ, ఔటర్ రింగ్ రోడ్ మార్గంగా ప్రయాణిస్తాయి.

వివరాలు 

సమాచారం కోసం 9959226149 నంబరును సంప్రదించాలని సూచన 

ప్రధానంగా విజయవాడ,గుంటూరు,చీరాల,రాజమండ్రి, అమలాపురం,కాకినాడ,నర్సాపురం, విశాఖపట్నం, పోలవరం తదితర ప్రాంతాలకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని బీహెచ్‌ఈఎల్‌ డిపో మేనేజర్ సుధా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులు జనవరి 9 నుంచి 13 వరకు ప్రయాణికులకు సేవలందిస్తాయని అధికారులు వెల్లడించారు. ప్రయాణానికి ముందే ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా రిజర్వేషన్ చేసుకునే సౌకర్యం కల్పించారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువైతే మరిన్నిఅదనపు బస్సులను కూడా నడపడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ స్పెషల్ సర్వీసులకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం 9959226149 నంబర్‌ను సంప్రదించవచ్చన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్‌లో టికెట్ ధరలు విమాన ఛార్జీల స్థాయికి చేరుతున్న సమయంలో,ఆర్టీసీ అందిస్తున్న ఈ తక్కువ ధర ప్రయాణ సౌకర్యాన్ని ప్రయాణికులు ఉపయోగించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Advertisement