LOADING...
RTC Buses: పండుగలకు ఊరెళ్లేవారికి ఆర్టీసీ గుడ్ న్యూస్
పండుగలకు ఊరెళ్లేవారికి ఆర్టీసీ గుడ్ న్యూస్

RTC Buses: పండుగలకు ఊరెళ్లేవారికి ఆర్టీసీ గుడ్ న్యూస్

వ్రాసిన వారు Moogati Shabari
Mar 16, 2026
05:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

పండుగల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉగాది, రంజాన్ పండుగలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. మార్చి 17, 18వ తేదీలలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశాన్ని పరిగణలోకి తీసుకుని అదనపు సర్వీసులను ఏర్పాటు చేయనుంది. తిరుగు ప్రయాణాల సమయంలో రద్దీని దృష్టిలో ఉంచుకుని మార్చి 23న కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. ప్రత్యేకంగా నడిచే బస్సుల్లో మాత్రమే గరిష్టంగా 1.5 రెట్లు వరకు చార్జీలు ఉండనున్నాయి. అయితే సాధారణంగా నడిచే రెగ్యులర్ బస్సుల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా సాధారణ చార్జీలే అమలులో ఉంటాయి. అలాగే మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా అందిస్తున్న ఉచిత ప్రయాణం యథావిధిగా కొనసాగుతుందని తెలిపింది.

వివరాలు

వరుస సెలవులతో ప్రయాణికుల రద్దీ

ఇక ఒకవైపు ముఖ్యమైన పండుగలు, మరోవైపు వరుస సెలవులు ఉండటంతో ముఖ్యంగా ఐటీ రంగానికి చెందిన ఉద్యోగులు తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గురువారం ఉగాది పండుగ ఉండగా, శనివారం రంజాన్ సందర్భంగా సెలవు ఉంటుంది. మధ్యలో ఉన్న శుక్రవారం ఒకరోజు మాత్రమే పని దినం. ఆ రోజు సెలవు తీసుకుంటే ఆదివారం వరకు కలిపి మొత్తం నాలుగు రోజుల వరుస సెలవులు లభించే అవకాశం ఉంటుంది. ఈ పెరుగుతున్న ప్రయాణ రద్దీని దృష్టిలో ఉంచుకుని మార్చి 17, 18వ తేదీలలో ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ఈ ప్రత్యేక బస్సులకు మాత్రమే ప్రత్యేక చార్జీలు వర్తించనున్నాయని తెలిపింది.

Advertisement