Page Loader
Rajnath Singh: రేవంత్‌ రెడ్డికి కృతజ్ఞతలు.. దేశ రక్షణ కోసం కలిసి పనిచేయాలి : రాజ్‌నాథ్ సింగ్
రేవంత్‌ రెడ్డికి కృతజ్ఞతలు.. దేశ రక్షణ కోసం కలిసి పనిచేయాలి : రాజ్‌నాథ్ సింగ్

Rajnath Singh: రేవంత్‌ రెడ్డికి కృతజ్ఞతలు.. దేశ రక్షణ కోసం కలిసి పనిచేయాలి : రాజ్‌నాథ్ సింగ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 15, 2024
03:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశానికి ఎంతో కీలకమైన ప్రాజెక్ట్ ప్రారంభించడం ఎంతో హర్షణీయమైనదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఇవాళ అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా శంకుస్థాపన పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన వికారాబాద్ జిల్లా దామగుండం రిజర్వ్ ఫారెస్ట్‌లో రాడార్ స్టేషన్ నిర్మాణానికి సంబంధించిన సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. దేశ భద్రత, రక్షణ విషయాల్లో రాజకీయాలు చేయకుండా దేశానికి సేవ చేస్తున్నామని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. దేశం కోసం ఈ రకమైన రాడార్ స్టేషన్లు ఎంతో ముఖ్యమైనవని, పూర్వంలో సమాచార మార్పిడి కోసం పక్షులను ఉపయోగించామని తెలిపారు.

Details

దేశాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

ఇప్పుడు మరింత బలమైన కమ్యూనికేషన్ వ్యవస్థను అభివృద్ధి చేయాలని కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. గత ముప్పై సంవత్సరాలుగా భారతదేశం కమ్యూనికేషన్ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కొందరు వ్యక్తులు ఈ ప్రాజెక్ట్‌పై తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేస్తున్నారని, పర్యావరణానికి హాని కలిగించదని, ఈ విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. ఈ ప్రాజెక్ట్ పర్యావరణానికి హాని కలిగించదని ఆయన పేర్కొన్నారు. దేశ రక్షణ, భద్రత విషయంలో కేంద్రం మరింత కట్టుబడి పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు.