LOADING...
Chandrababu: ప్రతి ఇంట్లో పండుగ శోభ చేర్చడమే లక్ష్యం.. పీ-4 విధానానికి చంద్రబాబు పిలుపు
ప్రతి ఇంట్లో పండుగ శోభ చేర్చడమే లక్ష్యం.. పీ-4 విధానానికి చంద్రబాబు పిలుపు

Chandrababu: ప్రతి ఇంట్లో పండుగ శోభ చేర్చడమే లక్ష్యం.. పీ-4 విధానానికి చంద్రబాబు పిలుపు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 12, 2025
05:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు పీ-4 (పబ్లిక్‌-ప్రైవేట్‌-పీపుల్‌-పార్టనర్‌షిప్‌) విధానంలో భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్రతి ఇంట్లో పండుగ శోభ చేర్చడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. పండుగ అంటే మనం సంతోషంగా ఉండడమే కాకుండా మన చుట్టూ ఉన్న అందరికీ సుఖసంతోషాలను పంచడమని అభిప్రాయపడ్డారు. ఆర్థిక అసమానతలను తొలగించడం, సమాజంలో ప్రతి ఒక్కరీ జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ద్వారా మాత్రమే ప్రతి ఇంటిలో సంతోషాలు వెల్లివిరుస్తాయని తెలిపారు.

Details

కలిసి పనిచేయాలని పిలుపు

ఈ లక్ష్యానికి చేరుకోవడానికి ప్రతిపాదించిన పీ-4 విధానంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్యకరమైన, ఆదాయంగా సబలమైన, ఆనందంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చడానికి ఈ పీ-4 విధానం కీలకమని వివరించారు. ఇందులో భాగంగా ప్రజలు, ప్రైవేట్ సంస్థలు, ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పీ-4 విధాన పత్రాన్ని విడుదల చేసి, ఆరోగ్య, ఆదాయ, ఆనంద రాష్ట్రం సాధించేందుకు సంకల్పం తీసుకోవాలని కోరారు.