Page Loader
Chandrababu Naidu: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు.. చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వు
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు.. చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వు

Chandrababu Naidu: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు.. చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వు

వ్రాసిన వారు Stalin
Oct 30, 2023
04:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు రిజర్వ్‌లో ఉంచింది. మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై తీర్పును మంగళవారం ప్రకటించే అవకాశం ఉంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో బెయిల్ అభ్యర్థనను ఏసీబీ కోర్టు తిరస్కరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు దమ్మాలపాటి శ్రీనివాస్, సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఆరోగ్య పరిస్థితి, బెయిల్‌కు మద్దతుగా వైద్యుల సూచనలను చంద్రబాబు తరఫు న్యాయవాదులు హైలైట్ చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రేపు తీర్పును వెల్లడించే అవకాశం