Page Loader
Veera Raghava Reddy: 'రంగరాజన్‌పై దాడి తప్పే'.. విచారణలో అంగీకరించిన రాఘవరెడ్డి!
'రంగరాజన్‌పై దాడి తప్పే'.. విచారణలో అంగీకరించిన రాఘవరెడ్డి!

Veera Raghava Reddy: 'రంగరాజన్‌పై దాడి తప్పే'.. విచారణలో అంగీకరించిన రాఘవరెడ్డి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 20, 2025
12:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

రంగరాజన్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డి పోలీసుల విచారణలో సంచలన విషయాలను బయటపెట్టాడు. మూడు రోజులుగా కొనసాగుతున్న విచారణలో రంగరాజన్‌పై దాడి చేయడం తప్పుడు నిర్ణయమని అంగీకరించాడు. ఈ సంఘటన వెనుక ఉన్న కారణాలను వివరించిన ఆయన, పోలీసుల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ తన చర్యను సమర్థించలేనని స్పష్టం చేశాడు. ఇకపై శాంతియుతంగా రామరాజ్య స్థాపన కోసం పనిచేస్తానని చెప్పాడు.

Details

చిన్నచూపు చూపడంతో దాడికి దాగాల్సి వచ్చింది

వీర రాఘవరెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం, తన అనుచరుల ముందు తనను చిన్నచూపు చూశారనే ఒత్తిడితోనే దాడికి దిగాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. పోలీసులు రామరాజ్యం స్థాపన ఎందుకు? అని ప్రశ్నించగా, 2015లో జరిగిన ఓ సంఘటనను కారణంగా చూపాడు. తన రెండో తరగతి చదువుతున్న కుమారుడిని మూడో తరగతికి ప్రమోట్ చేయకుండా నిలిపివేశారని, అప్పటి నుంచి అధికారులు, కోర్టుల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదని వెల్లడించాడు.