Tehreek-e-Hurriyat: భారత వ్యతిరేక ప్రచారం చేస్తున్న 'తెహ్రీక్-ఎ-హురియత్'పై కేంద్రం నిషేధం
చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద తెహ్రీక్-ఎ-హురియత్ (TeH)పై కేంద్రం ఆదివారం నిషేధం విధించింది. ఈ సంస్థకు గతంలో మరణించిన వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీ నేతృత్వం వహించారు. జమ్ముకశ్మీర్‌ను భారత్ నుంచి విడదీసి అక్కడ ఇస్లామిక్ పాలనను నెలకొల్పేందుకు TeH సంస్థ నిషేధిత కార్యకలాపాలకు పాల్పడుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. జమ్ముకశ్మీర్‌లో వేర్పాటువాదానికి ఆజ్యం పోసేందుకు భారత వ్యతిరేక ప్రచారాన్ని, ఉగ్రవాద కార్యకలాపాలను ఈ బృందం కొనసాగిస్తున్నట్లు కేంద్రం గుర్తించిందని అమిత్ షా అన్నారు. భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఏ వ్యక్తి లేదా సంస్థనైనా అడ్డుకుంటామని అమిత్ షా ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చారు.