NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Goa: కొడుకును చంపి.. బ్యాగులో కుక్కి.. బెంగళూరు సీఈఓ అరెస్ట్ !
    తదుపరి వార్తా కథనం
    Goa: కొడుకును చంపి.. బ్యాగులో కుక్కి.. బెంగళూరు సీఈఓ అరెస్ట్ !
    Goa: కొడుకును చంపి.. బ్యాగులో కుక్కి.. బెంగళూరు సీఈఓ అరెస్ట్ !

    Goa: కొడుకును చంపి.. బ్యాగులో కుక్కి.. బెంగళూరు సీఈఓ అరెస్ట్ !

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 09, 2024
    10:57 am

    ఈ వార్తాకథనం ఏంటి

    గోవాలో 39 ఏళ్ల మహిళ తన 4 ఏళ్ల కొడుకును హత్య చేసి మృతదేహంతో కర్ణాటకకు వెళ్లినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.

    వివరాల్లోకి వెళితే.. బెంగళూరులో స్టార్టప్ కంపెనీ నడుపుతున్న సుచనా సేత్‌ గత శనివారం తన 4ఏళ్ళ కుమారుడితో గోవా వెళ్ళింది.

    అక్కడ కాండోలిమ్స్ హోటల్ సోల్ బన్యన్ గ్రాండేలో దిగింది. అనంతరం సోమవారం ఉదయం గదిని ఖాళీ చేసి ట్యాక్సీలో కర్ణాటకకు వెళ్ళింది.

    ఆమె రూమ్ ఖాళీ చేసి వెళ్ళాక హోటల్ సిబ్బంది ఆమె ఉన్న గదిని శుభ్రం చెయ్యడానికి వెళ్లి గదిలో రక్తపు మరకలు చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    హోటల్ కి చేరుకున్న పోలీసులు సీసీ టివి ఫుటేజ్ పరిశీలించారు.

    Details 

    స్నేహితురాలి అడ్రస్  నకిలీ

    హోటల్‌లో కి వచ్చినప్పుడు కుమారుడితో కలిసి కన్పించిన సుచనా.. హోటల్ నుండి వెళ్లేటప్పుడు మాత్రం ఒంటరిగా కన్పించడంతో పోలీసులకు అనుమానం వచ్చింది.

    వెంటనే పోలీసులు ఆమె వెళ్లిన ట్యాక్సీ డ్రైవర్‌కు ఫోన్ చేసి సుచనాతో మాట్లాడారు. తన కొడుకు గురించి ప్రశ్నించగా, సుచనా అతన్ని ఫటోర్డాలోని స్నేహితుడి ఇంట్లో విడిచిపెట్టినట్లు పేర్కొంది.

    దింతో విచారణ చెయ్యగా ఆమె చెప్పిన స్నేహితురాలి అడ్రస్ నకిలీది అని తేలింది. పోలీసులు టాక్సీ డ్రైవర్‌కు మళ్లీ ఫోన్ చేసి,ఈసారి అతనితో కొంకణిలో మాట్లాడి, సూచనాకి అనుమానం రాకుండా సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లమని తెలిపారు.

    Details 

    సుచనా అరెస్టు..

    టాక్సీ అప్పటికి చిత్రదుర్గ జిల్లాలోకి ప్రవేశించింది. డ్రైవరు సుచనాకు తెలీకుండానే కారును ఐమంగళ పోలీస్ స్టేషన్‌కు తరలించాడు.

    అక్కడ ఓ అధికారి కారు తనిఖీ చేయగా బ్యాగులో చిన్నారి మృతదేహం కనిపించింది.

    సుచనాను అరెస్టు చేశారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. దీనిపై దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గోవా
    కర్ణాటక

    తాజా

    Jasprit Bumrah: బుమ్రా స్పెల్‌కి షాక్‌! ప్రాక్టీసు మ్యాచులో హడలెత్తిన బ్యాటర్లు జస్పిత్ బుమ్రా
    Toyota Fortuner: టయోటా ఫార్చ్యూనర్ ధర పెంపు.. కొనుగోలుదారులకు షాక్!  టయోటా ఫార్చ్యూనర్‌
    Balakrishna: అలాంటి చిత్రాలు, పాత్రల్లో నటించాలని ఉంది.. బాలయ్య బర్త్‌డే స్పెషల్‌ బాలకృష్ణ
    Tejas: భారత్‌ చేపట్టిన ఐదోతరం యుద్ధ విమానాలకు ఇంజిన్లు సరఫరా చేసేందుకు జీఈ ఆసక్తి  అమెరికా

    గోవా

    ముంబయి-గోవా హైవేపై కారును ఢీకొన్న ట్రక్కు, 9మంది మృతి మహారాష్ట్ర
    TVS MotoSoul 2023లో రోనిన్ మోటార్‌సైకిళ్ల ప్రదర్శన ఆటో మొబైల్
    షాకింగ్ న్యూస్: గోవాలో పర్యాటక కుటుంబంపై కత్తులతో దాడి; సోషల్ మీడియాలో వీడియో హల్‌చల్ దిల్లీ
    పీఎఫ్‌ఐ విచారణ: బిహార్, యూపీ, పంజాబ్, గోవాలో ఎన్‌ఐఏ దాడులు ఎన్ఐఏ

    కర్ణాటక

    CR Rao: తెలుగు మూలాలున్న ప్రపంచ గణిత మేథావి సీఆర్ రావు మృతి  భారతదేశం
    Bengaluru: బెంగళూరులో ప్రేయసిని ప్రెషర్ కుక్కర్‌తో కొట్టి చంపిన ప్రియుడు.. కారణం ఇదే!  బెంగళూరు
    మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు భారతదేశం
    కావేరీ జలాల కోసం రాత్రంతా  కర్ణాటక రైతుల నిరసనలు  తమిళనాడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025