Page Loader
చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణను అక్టోబర్ 13కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు
చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణను అక్టోబర్ 13కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు

చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణను అక్టోబర్ 13కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు

వ్రాసిన వారు Stalin
Oct 10, 2023
03:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు శుక్రవారానికి(అక్టోబర్ 13) వాయిదా వేసింది. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేసేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేల త్రివేది ధర్మానసం ఎదుట సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ, చంద్రబాబు తరఫున హరీష్ సాల్వే వాదనలు విపిపించారు. ఈ కేసులో సెక్షన్ 17ఎ చంద్రబాబు వర్తిస్తుందని హరీష్ సాల్వే పేర్కొన్నారు. ఈ సందర్భంగా గతంలో ఇచ్చిన కోర్టు తీర్పులను ఆయన ఉటంకించారు. ముకుల్ రోహత్గీ మాత్రం సెక్షన్ 17ఏ చంద్రబాబుకు వర్తించదని వాదించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సెక్షన్ 17ఏపై పోటాపోటీగా వాదనలు వినిపించిన సాల్వే, రోహత్గీ